'స్త్రీ స్వేచ్చ' తో మొదలై 41 నెలల కాలం లో 5 లక్షలు వీక్షణములు సాధించిన "మనవు " బ్లాగు !!
సెప్టెంబర్ 6, 2012 న "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే సరిగ్గా 41 నెలలు దాటింది . ఈ 41 నెలల కాలంలో సుమారు 900 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది.మొదటి టపా పేరు 'స్త్రీ స్వేచ్చ'.900 టపాలలో లలో కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 41 నెలల కాలంలో మనవు బ్లాగు 5 లక్షల వీక్షణములు సాదించడం ఘన కార్యం కాక పోయినా , సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు సంతోషం ని మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన . మనవు వీక్షణముల చరిత్ర "మనవు" ప్రారంభించిన తేదీ :- ...