పాపి కొండలు యాత్రను "రంకు టూరిజం" గా మార్చిన రాజమండ్రి బోట్ ఆపరేటర్లను నిరోదించలేని సీమాంద్రులకు "భద్రాచలం " కోరే నైతిక అర్హత ఉందా?
భద్రాచలం పరమ పుణ్య గోదావరీ తీర దామం. అక్కడికి భక్తులు రోజూ వేల మంది వస్తుంటారు. అక్కడికి వచ్చే వారందరికి ఒకటే బావం . అలౌకిక ఆద్యాత్మిక బావం. దండకారణ్య పచ్చని ప్రకృతి ఒడిలో విలసిల్లిన భద్రాచల క్షేత్రం భక్తులకు ఆద్యాత్మికతో కూడిన ఆహ్లాద బావనలు కల్గించడంతో పునీతమవుతుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న "పర్ణ శాల" గోదావరీ ఒడ్డున ఉండటమే కాక, అకడి సహజ ప్రక్రుతి అందాలతో భక్త గణానికి ఆద్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. రామాయణ కాలంలో రాములు వారు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం గడిపిన ప్రాంతంగా ఈ ప్రాంతం యావత్ ప్రపంచం లోనే ఒక విశిష్ట ఆద్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతుంది. భద్రాచలం ఆంద్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లా లో ఉంది. ఈ ప్రాంతం ఏజెన్సి ప్రాంతం. ఇక్కడి గిరిజన సంస్క్రుతి నేపద్యం కూడా ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇక్కడ నుండి కూనవరం వరకు రోడ్డు మార్గం , అక్కడి నుండి గోదావరి నది లో బోట్ ప్రయాణం ద్వారా ఖమ్మ