పాపి కొండలు యాత్రను "రంకు టూరిజం" గా మార్చిన రాజమండ్రి బోట్ ఆపరేటర్లను నిరోదించలేని సీమాంద్రులకు "భద్రాచలం " కోరే నైతిక అర్హత ఉందా?

                                                                
                                                        
 భద్రాచలం పరమ పుణ్య గోదావరీ తీర దామం. అక్కడికి భక్తులు రోజూ  వేల మంది వస్తుంటారు. అక్కడికి వచ్చే వారందరికి ఒకటే బావం . అలౌకిక ఆద్యాత్మిక బావం. దండకారణ్య పచ్చని ప్రకృతి ఒడిలో విలసిల్లిన భద్రాచల  క్షేత్రం  భక్తులకు ఆద్యాత్మికతో కూడిన ఆహ్లాద బావనలు కల్గించడంతో పునీతమవుతుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న "పర్ణ శాల" గోదావరీ ఒడ్డున ఉండటమే కాక, అకడి సహజ ప్రక్రుతి అందాలతో భక్త గణానికి ఆద్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. రామాయణ కాలంలో రాములు వారు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం గడిపిన ప్రాంతంగా ఈ  ప్రాంతం యావత్ ప్రపంచం లోనే ఒక విశిష్ట ఆద్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతుంది.

    భద్రాచలం ఆంద్ర ప్రదేశ్   లోని ఖమ్మం జిల్లా లో ఉంది. ఈ  ప్రాంతం ఏజెన్సి ప్రాంతం. ఇక్కడి గిరిజన సంస్క్రుతి నేపద్యం కూడా ఈ  క్షేత్రానికి  ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇక్కడ నుండి కూనవరం వరకు రోడ్డు  మార్గం , అక్కడి నుండి   గోదావరి నది లో బోట్ ప్రయాణం ద్వారా ఖమ్మం జిల్లలోని పేరంటాల పల్లి వెళ్లి అక్కడి అందమైన  పాపి కొండల ను , చుట్టు పక్కల ఆద్యాత్మిక , ప్రక్రుతి ద్రుశ్యాలను చూస్తూ ప్రతి ఒక్కరూ పులకించి పోతారు. అకడనుండి రాజమండ్రికి కూడా  బోట్ ప్రయాణం ద్వారా వెళ్ళ వచ్చు. ఈ  ప్రాంతం లోని  సహజ ప్రక్రుతి వనరులు, ఇతిహాస కాలం నాటి నేపద్యంతో కూడిన ఆద్యాత్మిక క్షేత్రాల సందర్శన ఖచ్చితం గా అటు భక్తులకే కాక , ప్రక్రుతి ప్రేమికుల ను విశేషంగా ఆకర్షిసితుంది. కానీ అటువంటి "పాపి కొండల యాత్రలను" తమ స్వార్ద ప్రయోజనాల కోసం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన కొంత మంది ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు "పాప కొండల యాత్రలు" గా మార్చారు.

  ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక "ఇండియన్ ఎక్స్ప్రేస్స్ " వారి కదనం మేరకు రాజమండ్రి లోని కొంత మంది ప్రైవేట్ టూరిజం ఆపరేటర్లు ఒక జట్టు గా ఏర్పడి "రంకు టూరిజం " నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వీరు విటులను " పాపి కొండలు  యాత్ర" , భద్రాచలం యాత్ర పేరుతో  పాపి కొండలు రాజమండ్రి మద్య ఉన్న  ఇసుక తిన్నెల మీదకు చేర్చి ,అకడ వేసిన "వెదురు గుడిసెల్లో " ఈ  పాపపు వ్యాపారం నిర్వహిస్తున్నారట! విటులకు కావాల్సిన అమ్మాయిలను "పెద్దాపురం, రాజమండ్రి, వైజాగ్ " ప్రాంతాల నుండి రప్పించి  ఈ  వ్యాపారం  ముగ్గురు విటులు , ఆరుగురు వేశ్యలు గా వర్దిల్లేటట్లు చేస్తున్నారట. ఊరు అన్నాక మంచి వారు ఉంటారు. చెడు మనస్తత్వం కలిగిన వారు ఉంటారు . దానిని ఎవరూ కాదనరు. రాజమండ్రి కూడా  చారిత్రకంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న ప్రాంతం. మరి అటువంటి ప్రాంతం లో కొంత మంది టూరిజం వ్యాపారులు దేవుని యాత్రలు , పర్యాటక యాత్రలు పేరుతో పాపపు బిజినెస్స్ లు చేస్తుంటే అక్కడి పౌర సమాజానికి దానిని నిరోదించడనికి తగిన చర్యలు తీసుకొమ్మన్ని ప్రబుత్వ యంత్రాంగాలను కోరే నైతిక బాద్యత లేదా? ఎవరు ఏమి చేస్తే మన కేమిటిలే అని నిర్లిప్త దోరణి తో ఉండే వారికి "భద్రాచలం" పుణ్య ప్రాంతాన్ని మాకు అప్ప చెప్పండి అని కేంద్రాన్ని కోరే నైతిక అర్హత ఎక్కడిది. ? ఆలోచించండి.
                                              

     వ్యాపార లాభాల కోసం ఎంత నీచమైన పని చేసే వ్యాపారులు, ఆద్యాత్మిక మరియు పర్యాటక యాత్రలు  పేరుతో పాపపు యాత్రలు చేస్తుంటే దానిని ఖండించి నిరోదించలేని వారికి పుణ్య క్షేత్రాల ను అప్పచెప్పడం కూడా  "పాపపు చర్యలు" గానే బావించాలి. అటువంటి పాపపు పనిని భారత పార్లమెంట్ చేయదని నమ్ముద్దాం. పరమ పవిత్ర "భద్రాచల క్షేత్రం " తెలంగాణ రాష్ట్రం లోనే ఉండాలని ఒక  ఆద్యాత్మిక వాదిగా అభిలషిచడం లో తప్పు లేదనుకుంటా. అందుకే నేటి నుంచి భద్రాచల వాసులు తల పెట్టిన 72 గంటల బంద్ కు సంఘీ బావం ప్రకటిస్తున్నాను.

  జై రామా                              జై జై భద్రాచల రామా                            జై రామా

  నేను పైన తెలిపిన ఇండియన్ ఎక్సప్రీస్ కదనం కొరకు ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడగలరు http://newindianexpress.com/states/andhra_pradesh/Papi-hills-going-the-sex-tourism-way/2013/06/17/article1638570.ece

మరింత సమాచారం కొరకు ఈ  లింక్ ని క్లిక్ చేసి  చోడగలరు.

నా తెలంగాణా , భద్రాచలం ,మునగాల గాయాల వీణా !

http://ssmanavu.blogspot.in/2013/11/blog-post_11.html

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!