N.T.R గారి జీవిత చరిత్ర రచన కు బయపడే K.C.R. గారి జీవిత చరిత్ర అయన కుమార్తె రాయాలనుకుంటుందా!?
ఎవరైనా పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనిషి గురించి జీవిత చరిత్ర రాస్తాను అనుమతించండి అని ఎవరైనా స్త్రీలు అంటే అనుమానంగా చూడాల్సిన పరిస్తితి ఉందంటే ఆశ్చర్యం లేదు . అంతే కాదు టక్కున N.T.R గారు గుర్తుకు వస్తారు. కారణం అయన జీవిత చరిత్ర రాస్తాను అని వచ్చిన ఒక మహిళ అయన జీవిత చరిత్రనే మార్చి వేసింది.ఆయనకే ఏకంగా బార్య అయింది. హిందూ జీవన విదాననికి కంకణ బద్దుడైన అయన , విది లేని పరిస్తితుల్లో మూడవ దశ అయిన వాన ప్రస్తం నుండి రెండవ దశ అయిన "గ్రుహస్తం" లోకి రావాల్సి వచ్చింది. దాని తాలూకు ఎఫెక్టు అయన చనిపోయినా , అయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. అటు కుటుంబపరం గానే కాక ఇటు రాజకీయ పరంగా కూడా , N.T.R గారి రెండవ పెండ్లి తాలూకు నీడలు ఆయన కుటుంభ సబ్యులను వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి తెలుగు నాట రాజకీయ నేతల జీవిత చరిత్రను రాస్తామని ఎవరైనా స్త్రీలు అంటే సదరు రాజకీయ నాయకుల కుటుంభ సబ్యుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తడం ఖాయం.
అందుకే కాబోలు అటువంటి పరిస్తితి తమకు రాకూడదనే ముందు జాగర్తగా K.C.R గారి కుటుంబం జాగర్త పడుతున్నట్లుంది. అయన జీవిత చరిత్రను అయన గారి కుమార్తె కవిత రాయడానికి పూనుకుందట! తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ఆ పని మొదలెడుతుందట. అలా అని ఒక మిడియా సమావేశం లో ప్రకటించి తన రైటర్ పోస్ట్ను రిజర్వ్ చేసేసుకుంది. స్వయంగా కూతురే ప్రకటించాక ఆ తండ్రి మాత్రం కాదంటాడా! N.T.R గారికి బార్య లేదు కాబట్టి భయం కానీ, K.C.R గారి పరిస్తితి వేరు కదా అనుకోవచ్చు. కానీ పరిస్తితులును ఎవరు నమ్మ గలరు? ఆటో బయో గ్రపి పేరుతో అంతా తెలుసుకుని అతుక్కు పోతే! ఆ తర్వాత జరిగే వారసుల పోరులో తను పోటీ దారుగా మారితే !? అమ్మో ఇంకేమన్నా ఉందా?
అసలే ఇప్పటికే K.C.R గారి కుటుంబం లో 3 గ్గురు వారసులు ఉన్నారు. రేపు తెలంగాణా వచ్చాకా 3 అధికార కేంద్రాలు అవుతాయి. ఆ పరిస్తితిలో ఆయనకి వారసుల మద్య అధికార పంపిణీయే పెద్ద తల నొప్పిగా మారవచ్చు. అటువంటి ఒకానొక బలహీన క్షణం లో అయన జీవిత రచయిత్రులు ఎవరైనా ఎంటర్ అయితే ? అదిగో ఆ భయం తోనే కూతురు ఆ రచనా బాద్యత తనదేనని ప్రకటించి ఉండవచ్చు. ఏది ఏమైనా తండ్రి జీవిత చరిత్రను కుమార్తె రాయాలనుకోవడం ముదావహం. తండ్రి జీవిత చరిత్రను రాసి తన జీవితం సార్దక్యం చేసుకుంటున్నందుకు బెస్ట్ అప్ లక్ చెప్పడమే మనం చేయగలిగింది.
కవిత గారి మాటలు ప్రకారం మనకర్దమయ్యేది ఏమిటంటే K.C.R గారి ప్రక్కనే ఉండి అయన పడిపోవటానికి గోతులు తీసిన వారి గురించి ముఖ్యంగా అయన జీవిత చరిత్రలో ఉండబోతుండట. అంటే తెలంగాణా లోని చాలా మంది నాయకుల అసలు స్వరూపాలు ను కవితమ్మ బయట పెట్ట బోతుందన్న మాట! అయితే ఇది ఒక సెన్సేషనల్ సినిమా లాంటిదే అన్న మాట! మరి తెలంగాణా వారెవ్వరూ దీని అడ్డుకోరా?
Comments
Post a Comment