టి.వి. రాములమ్మ, తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ లు తప్పా , తెలంగాణా వారికి మిగిలేది ఏమి లేనట్లుంది!


                                                 
       

 ఈ  మద్య తెలంగాణా కాంగ్రెస్ వారు తెలంగాణా వచ్చేసిందని సోనీయమ్మను కీర్తిస్తూ ఉరూరా సంబురాలు చేసుకుంటునారు. వారి ప్రదాన ఉద్దేశ్యం తెలంగాణా వచ్చిందని చాటడం కాదు, తెలంగాణ ఇచ్చింది తమ నాయకురాలు సోనియా గాందీ యే తప్పా అందులో T.R.S  వారి ఘనత ఏమి లేదని చెప్పడమే. సరే బాగానే ఉంది. తెలంగాణా ఇచ్చింది ఎవరు , తెచ్చింది ఎవరు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు 2014 లో తేలుస్తారు కానీ, అసలు పదేళ్ళు పైనా పోరాడి సాదించమంటున్న "తెలంగాణా రాష్ట్రం " వలన తెలంగాణా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా? సీమాంద్రా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా ఒక సారీ చూదాం .

     నిన్న మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాటన్నారు
     " తెలంగాణ రాష్ట్రం " ఏర్పాటు వలన సీమాంద్రుల కంటే తెలంగాణ వారే ఎక్కువ నష్టపోతారు".

అలాగే డిల్లీలో దిగ్విజయ్ సింగ్ గారు కూడా  ఒక విలువైన మాట చెప్పారు .
" తెలంగాణా కోరుకున్నందుకు తెలంగాణా ప్రజలు పదేళ్ళ తర్వాత పశ్చాతాపపడతారు . నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేక పోయినా పార్టి నిర్ణయానికి తల వంచక తప్పటం లేదు."

   పై మాటలు ఏదో సిమాంద్రా ప్రజలను బుజ్జగించడానికి అన్న మాటలు కావని "ఆంటోనీ కమిటీ నివేదిక" మరియు సీమాంద్రా మంత్రుల కోరికల లిస్ట్ చూస్తుంటే అర్దమవుతుంది. మొన్నటి దాక ఆంటోనీ కమిటీ అధికారిక కమిటీ అని ప్రజల్ని నమ్మించ చూసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో ఆ కమిటీ నివేదికమొదట  తమ పార్ట్ అద్యక్షురాలు పరిశిలనకు పంపడం జరుగుతుందని, ఆ తర్వాతే దాని మీద ఏమి చేయాలన్నది ఆలోచిస్తారని చెపుతున్నారు. అంటే మొదట ఆ నివేదికకు "అమ్మ" గారి  ఆమోద ముద్ర వేయించి తర్వాత బిల్ లో తప్పనిసరిగా పొందుపరుస్తారు అన్న మాట! మరి ఆంటోనీ గారీ నివేదిక వలన ఎవరకి లాభం అనేది చూస్తె

     తెలంగాణా రాష్ట్రం
(1). పది జిల్లాలతో అంక్షలతో కూడిన రాష్త్రం .అందులో హైదరాబాద్ మీద పదేళ్ళు అదికారం కేంద్రానికి కట్ట బెట్టాలి. విద్య ఉద్యోగాలు సీమాంద్రా వారితో పంచుకోవాలి.
(2). ఖమ్మం జిల్లాలోని భద్రా చలాన్ని సీమాంద్రా రాష్ట్రానికి అప్ప చెప్పాలి .
(3). రాష్త్రం లోని ఉమ్మడి క్రిష్ణా నదినే కాక , గోదావరి జలాలను సీమాంద్రా వారితో పంచుకోవాలి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీటిని క్రిష్ణా జిల్లాకు పంపిణీ చేయాలి. ఇన్నాళ్ళు జల దోపిడి అన్నది ఇప్పుడు చట్ట బద్దం అవబోతుంది .
(4). పేరుకు హైదరాబాద్ నగరం తెలంగానేదే అయినా , అందులో రెవెన్యూను 60% సీమాద్రాకు ఇవ్వాల్సి ఉంటుంది.
(5) సీమాంద్రుల ఆస్తుల పరిరక్షణకు "నిర్బయ"  కంటే కఠిన చట్టం వస్తే ,నోటి దూల ఉన్న తెలంగాణా వాదులు చాలా మంది జైల్లోనే మగ్గాల్సి రావచ్చు.
 (6) అప్పులు , ఆస్తులు పంపకాల్లో ఆస్తులు ఏమి వస్తాయో తెలియదు కానీ "పాస్తులు" మాత్రం నూరుశాతం తెలంగాణకే! 

ఆంద్ర ప్రదేశ్  @సీమాంద్రా రాష్త్రం 
(1). 13 జిల్లాలతో కూడిన రాష్త్రం .అంక్షలు లేని రాష్త్రం.

(2). భారత దేశం లోనే విశిష్ట త కలిగిన  "తిరుపతి" క్షేత్రమే కాక, భద్రాచలం కూడా  దీని పరిదిలోకే రాబోతుంది.

(3). అతి పొడవైన , సహజ  సముద్ర తీర ప్రాంతం . బవిషతులో "నాచురల్ గాస్' లో స్తానిక వాట లభిస్తే పండగే.

(4). హైదరాబాద్లో 60% రెవెన్యూ  వాటా, విద్య , ఉపాది , జల వనరులలో లోను చట్ట బడ్డ మైన వాటా, దిని వలన తెలంగాణా వారిచేత వేయించుకున్న  దోపిడీ దారులు అనే ముద్ర తొలగిపోవడమే కాక, ఆదే చట్టబద్ద మవుతుంది .

(5). హైదరా బాద్ లో వసూలు , మామూళ్ళు ఇవ్వవలసిన బాధ  తప్పుతుంది. వసూలు రాజాలని రాబోయే "సెటిలర్స్ పరిరక్షణ చట్టం" నిరోదిస్తుంది.

(6). నూతనంగా నిర్మించబోయే సీమాంద్రా రాజదానికి యేటా 40,000 కోట్లు చొప్పున 20 సంవత్సరాలు సుమారు ఎనిమిది లక్షల కోట్లు వెచ్చించి బారత దేశం లోనే నంబర్ 1 నగరం నిరిమించబడుతుంది .

(7). ఆ నగరం నుండి హైదరాబాద్ కు స్పెషల్ ఏక్స్ప్రేస్ రోడ్ వే , రైల్ వే నిర్మించబడతాయి.

(8). శ్రీ  కాకుళం నుండి అనంత పురం వరకు 8 లైనల రహదారి నిర్మిస్తారు.

(9). వారి కరెంట్ ఉత్పత్తిలో 50% మిగులుతుంది కాబట్టి , దానిని అమ్ముకునే అవకాశం

(10), హైదరాబాద్ కు శాంక్షన్ అయిన I.T  హబ్ లో సగ బాగం విశాఖ కు తరలివెల్లే అవకాశం.

ఇలా చాలా లాబాలు తెలంగాణాతో పోలిస్తే సీమాంద్రులకే ఎక్కువ కలిగేటట్లు ఉన్నాయి. హైదరాబాద్ U.T  అయినా కాకపోయినా , రూపం ఏదైనా సీమాంద్రులకు పైన వన్నీ కలుగచేసే విదంగా  తెలంగాణా బిల్ రూపొందవచ్చు.పదేళ్ళు పోరాటం చేసి తెలంగాణా వారు తెలంగాణా అనే పేరు తప్పా ఏమి సాదించలేక పోతున్నారు. అదే 3 నెలల పోరాటం తో సకలం సాదిస్తున్నారు సీమాంద్రులు. మరి ఇటువంటి అంక్షలతో కూడిన  తెలంగాణా ను పొంది తెలంగాణా వారు పొందేదేమిటి? దీని బదులు ఏటా లక్ష కోట్లు ఒక 10 సంత్సరాలు తీసుకుని తెలంగాణా జిల్లాలు బాగు చేసుకుంటే పోలా! కాదు , కూడదు అనుకుంటే ఇక మనం అంతా హాయిగా ఇంట్లో కూర్చుని, ఆ టి.వి. రాములమ్మ, తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ లు చూసుకుంటూ "జై తెలంగాణా " అనుకుంటూ కాలం గడిపేయ వచ్చు.కొంచం ఆటా పాటా వస్తే ""వాడేందిరో , వాడి పీకుడేందిరా " అని విప్లవ గీతాలూ  ఆలపించుకోవచ్చు! జై తెలంగాణా ! జై జై తెలంగాణా !

 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!