"భారత రత్న" ఇచ్చి మరీ ఇడియట్స్ అయిపోయారు.

                                                          
శ్రీ చింతామని నాగేశ రామచంద్ర రావు గారు. భారతీయ శాస్త్రవేత్త .బారత ప్రధాని శాస్త్ర విజ్ణాన  సలహాదారు సంఘం కి అదిపతి. ఆయనగారు రసాయన శాస్త్రం లో చేసిన కృషికి మెచ్చి, భారత ప్రభుత్వం ఆయనకి మొన్న "క్రికెట్ దిగ్గజం" సచిన్ టెండుల్కర్ గారితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన "భారత రత్న" బిరుదు ప్రదానం చేసి గౌరవించింది. దీనికి జాతి యావత్తు హర్ష్ంచింది. కానీ తనకు ఎవరైతే" భారత రత్న"  ఇచ్చి గౌరవించారో , అట్టి రాజకీయ నాయకుల ను అయన గారు తెల్లారే "ఇడియట్స్" అనే మకుటం తో గౌరవించి , వారి పట్ల తనకున్న కసినంతా తీర్చుకున్నారు. ఇది నిజంగా విచారించవలసిన విషయం.

   ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు అధిపతులుగా వారి పర్యవేక్షణ లో నడిచేది. రావుగారు సాక్షాత్తు ప్రధాన మంత్రి గారి శాస్త్ర విజ్ణాన సలహాదారు సంఘం కి హెడ్ . ఆయనగారికి ప్రధాన మంత్రి గారితో ఎంతో సన్నిహిత సంబందాలు ఉంటాయి. ఒక వేళ సైన్స్ అభివృద్దికి తక్కువ నిధులు కేటాయిస్తుంటే, అయన గారు ఆ  విషయం ప్రధాన మంత్రి గారితో  చెప్పవచ్చు. నిధులు ఎక్కువ కేటాయించేలా చేయవచ్చు. మొన్నీ  మద్యనే వేల కోట్లు ఖర్చు చేసి అంగారక గ్రహం మీదకు అంతరిక్ష పరిశోదన నౌక ను ప్రయోగించి, భారత్ కూడా అగ్రరాజ్యాలసరసన నిలబడిందని మురిసి పోతున్న వేళ ఈ  సైంటిస్ట్ గారు అంత నింద వేయటం , అదీ మరీ తనకు "భారత రత్న" ఇచ్చిన తెల్లారే , ఇచ్చిన వారిని ఈడియట్స్ చేయటం C.N.R రావు గారి లాంటి శాస్త్రవేత్త హుందాతనానికి మాయని మచ్చే.

 ఆయనగారు నిన్న మీడియా కు చెప్పిన మాటలు బట్టి ఆయనకు I.T  టెక్నాలజి అన్నా సరిపడదు  అని తెలుస్తుంది. I.T  అనేది సైన్సేకాదు , దాని అభివృద్ధి వలన అంత ఉపయోగం లేదు    అని అయన గారి ద్రుడాభిప్రాయం లాగుంది. ఏది ఏమైనా ఆయనగారు తన బావాలను సరి అయిన సమయంలో సరి అయిన చోటులో తెలియపరస్తే బాగుండేది. కానీ "భారత రత్న" గ్రహీతగా ఆయనను జాతి యావత్తు , కీర్తిస్తున్న వేళ భారత రాజకీయ నాయకులను "ఇడియట్స్" అని ప్రంపంచస్తాయిలో వారి స్తాయిని దిగజార్చడం ఎంతవరకు సబబు? ఒక వేళ వారు ఈడియట్స్ అనే బావిస్తే వారు నిర్వహించే ప్రభుత్వం ఇచ్చిన "భారత రత్న " ను తీసుకోకూడదు మరి!  అలా  చేసి తన నిరసనను జాతికి తెలియచేయగలరా?
    ఏది ఏమైనా "భారత రత్న " బిరుదాంకితులు అయిన శ్రీ C.N.R  రావుగారికి మరియు సచిన్ టెండుల్కర్ గారికి శుభాబినందనలు !

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )