"మద్యం తాగుదాం , తాగి అన్నీ చేద్దాం పద" అన్నాడట! ఏమిచేయలెదని క్షమాపణ చెపితే వదిలేశారట!

                                                       


మన దేశం లో "నిర్భయ"  నిభందనలు వచ్చాక కూడా , రాకముందు చట్టం  ఎలా ఉందో , ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నారు కాబోలు కొంతమంది అధికారులు. అందుకే మొన్న పనాజీలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఒక డిప్యూటి డైరెక్టర్ గారు తానూ చేసిన సిగ్గుమాలిన పనికి క్షమాపణ లాంటిది  చెపితే ,O.K  అని కేసు క్లోజ్ అన్నారట! వివరాల్లోకి వెళితే :-

   మొన్నీ మద్య గోవా లోని పనాజీలో జరిగిన అంతర్జాతీయ చలన చితోత్సవం లో ప్రోగ్రామర్  గా  పనిచెయ్యటానికి డిల్లీ J.N.T.U  కు చెందిన విద్యార్దిని  నియమితురాలైంది. ఆ అమ్మాయి ని ఒక డిప్యూటి డైరెక్టర్ గారు పని ఉంది రమ్మని తన కాబిన్ కి పిలిచాడట. ఏదో పని ఉందేమో కదా అని ఆ అమ్మాయి అక్కడికి వెళితే , " రా, రా, మద్యం తాగుదాం , అని  ఆఫర్ చేసాడట! దానికి ఆ అమ్మాయి ఇబ్బందిగా పిల్ అవుతుంటే , "తాగుదాం, తాగిన తర్వాత అన్నీ చేదాం " అని వెచ్చగా తన మనసులోని మాట చెప్పాడట. దానికి ఆ అమ్మాయి అభ్యంతరం చెపుతున్నా పదే పదే అదే కోరికను వెలిబుచ్చాడట. దానితో ఆ అమ్మాయి అక్కడి ఫెస్టివల్ ఆఫిసర్కి   The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013," క్రింద ఆ  సంఘటన గురించి రిపోర్ట్ చేసిందట. దాని మీద వారు 3 మెన్ కమిటీ వేసి సదరు డెపూటి  డైరెక్టర్ గారిని పిలిచి విచారిస్తే , అతను  కమిటీ ముందు మాట పూర్వకంగా క్షమాపణ కోరాడట. దానికి ఆ అమాయి కోరిన విదంగా రాత పూర్వక క్షమాపణ ఇవ్వనందుకు మాట పూర్వక క్షమాపణకు అంగీకరించక డిల్లి వెల్లిపోయిందట. కానీ కమిటీ వారేమో క్షమాపణ చెప్పాడు కాబట్టి కేసు క్లోజ్ అని సెలవిచ్చారట!.

   పైన తెలిపిన ఆక్ట్ ప్రకారం ఎవరైనా స్త్రీ కంప్లైంట్ చేస్తే సంబందిత కమిటీ వారు ముందు ఇరు పార్టిలను కూర్చోబెట్టి ఒక కాంప్రమైజ్ కు వచ్చేలా చూడవచ్చు. ఆ సెటిల్ మెంట్ కూడా  డబ్బులతో ముడి పడి ఉండకూడదు . ఆ తర్వాత ఆ సెటిల్ మెంట్ అంశాలు ను సంబందిత మగ ఉద్యోగి పని చేసే ఆపిసర్ కి పంపి అది అమలు చేయమని కోరాలి. కాంప్రమైజ్ కాకపోయినా , కాంప్రమైజ్ అయి కూడా  తర్వాత దానిని ఉల్లంఘించినా , సదరు కమిటీ వారు తగు విచారణ జరిపి , పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఇదీ ప్రోసీజర్. కానీ ఈ  కేసులో అమ్మాయి అంగీకారం లేకుండానే సెటిల్ మెంట్ O.K  అని కేసు క్లోజ్ చేసినట్లు కనపడుతుంది. ఒక వేళా అదే నిజమయితే కమిటి సభ్యల మెడకు కూడా  కేసు చుట్టుకుంటుంది. ఈ  ప్రోసీజర్ కేవలం ఉద్యోగినులు పని చేసే చోట తోటి ఉద్యోగులతో లైంగిక వేదింపులకు .గురి అయినప్పుడే వర్తిస్తుంది. ప్రైవేట్ చర్యలకు వర్తించదు. డైరెక్టుగా పోలిస్ కేసే! .

   నాకు తెలిసి తెహెల్కా తరుణ్ తేజ్ పాల్ కేసులో కూడా  ఇది ద్రుష్టిలో పెట్టుకునే అతగాడు 6 నెలలు ఎడిటర్ పదవి నుంచి దూరంగా ఉంటాను అని స్వయం ప్రకటిత శిక్ష విదించుకుని పరివర్తనా మూర్తిగా బిల్డ్ అప్ ఇవ్వబోయాడు . కానీ బాదిత లేడీ జర్నలిస్ట్ ఒప్పుకోలేదని మీడియా ద్వారా పోకస్ అయ్యాకా సోమోటో గా గోవా గవర్నమెంట్ ప్రాదమిక విచారణ జరిపి అతని మీద చర్యలకు సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది.

   ఏది ఏమైనా పెద్ద పెద్ద హోదాలో ఉన్న మగవారు అల్పమైన సుఖం కోసం , అది కూడా  తీర్చుకోవటానికి అనేక అవకాశాలు ఉన్న నేటి సమాజం లో ఇష్టం లేని ఆడపిల్లల్ని కదిలించి, వారి మనోబావాలు గాయపరచి , వారు పబ్లిక్ లో తెలియపరస్తే , ఇలా ఎందుకు ఆబాసు పాలు అవుతున్నారు అంటే , అదేనండి.. అదే .. "మగబుద్ది" . దానీ తీరే అంత! దానికి లజ్జా , భయం ఉండవు . ఉన్న దానితో తృప్తి పడదు అది. కంటికి నచ్చిన ప్రతిదీ కావాలనుకుని ఇలా పరువును పోగొడుతుంది . దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ  క్రింది లింక్ http://ssmanavu.blogspot.in/2013/11/blog-post_21.htmlను క్లిక్ చేసి చోడండి.

    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం