Posts

Showing posts with the label ఆమె

"ఆమె" గురించి ఆంద్ర ప్రదేశ్ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియక పోవచ్చునేమో !?

                                                          ఆమె! ఒక అమ్మగా , ఒక అక్కగా , ఒక అలిగా, ఒక బిడ్డగా , మన మధ్యే ఉంటుంది . మన తోనే ఉంటుంది . ఆమె ను అబల  అని తెలియని  కొందరంటే , కాదు ఆదిశక్తి అని ఆమె గురించి పూర్తిగా తెలిసిన వారు అంటుంటారు . అందుకే ఆమె శక్తిని తెలిసిన వారు ఆమెను పూజిస్తుంటే , తెలియని రాక్షసులు ఆమెను చెర బట్టి హింసించాలని చూస్తుంటారు . ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని విశ్వసించిన భరత  జాతి మనది  . "గౌతమి పుత్ర  శాత కర్ణి , వాసిష్ట పుత్ర పులుమావి అని తల్లి పేర్లను తమ పేర్ల ముందు చేర్చుకుని గర్వంగా మీసం మేలేసిన వారు మన ప్రదమాంద్ర పాలకులు . కాబట్టి ఆ  "ఆమె"  గురించి తెలుగు వారికి ఎల్లప్పుడూ సద్బావనే !   కాని "ఆమె"లో ఉన్న పాజిటివ్ గుణం ఆమెను గౌరవించేలా చేస్తుంటే , నెగటివ్ గుణం  ఆమె ను ద్వేషించే లా చేస్తుంది . అప్కోర్స్ ఇదే సూత్రం "అతడు"కు  కూడా ...