ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !

మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన కట్టు బాట్లు పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పుర...