ఇక నుండి చీర్ గర్ల్స్ లాగ బార్ గర్ల్స్ ని చూడొచ్చన్నమాట!.
ఖర్మ భూమిలో కాంతలకు సమానత్వం లేదని తెగ బాద పడిపోతున్న నియో వ్యాపార వాదులకు శుభ వార్త!. కర్ణాటక లో బార్ యజమానులంతా కలసి, తాము తమ బారులలో స్తిలను వెయిటర్ లు పెట్టుకుని కస్టమర్ లకు కిక్కు ఎక్కిస్తుంటే, ఓర్వలేని పోలిసులు అడ్డు చెపుతున్నారని, హైకోర్టు వారిని ఆశ్రయించారట. హై కోర్టు వారు కూడ వారి సమస్యను సానుభూతితో పరిశిలించి, బార్ లలో "వేచివుండే"(వెయిటర్స్) వారి గా స్త్రీలను నియమించుకోవచ్చని ఆర్డర్ ఇచ్చారట. కాకపోతే కొన్ని నిబందనలు పాటించమని చెప్పే అధికారం ప్రభుత్వానికి ఉందని హై కోర్టు వారు అంటే, దానికి కూడ బార్ యజమానుల తరపు లాయర్లు లా పాఇంట్ తీసి అబ్యంతరం చెపితే, ముందు ట్రైల్ వెయ్యండి. తర్వాత మీ సాదక బాదకాలు గవర్నమెంటు తో చెప్పి సమస్యను పరిష్కరించుకోవచ్చు. అని సెలవిచ్చారట గవర్నమెంట్ తరపు వకీలు గారు. మొత్తానికి కన్నడ బార్ యజమానులు స్తి వెయిటర్ ల కోసం చేసిన పోరాటం లో విజయం సాదించారు అన్న మాట!. కొంచెం వేలు పెట్టే సందు ఇస్తే చాలు