ఇక నుండి చీర్ గర్ల్స్ లాగ బార్ గర్ల్స్ ని చూడొచ్చన్నమాట!.


                                                                       

                                                                       
 ఖర్మ భూమిలో  కాంతలకు  సమానత్వం లేదని తెగ బాద పడిపోతున్న నియో వ్యాపార వాదులకు శుభ వార్త!. కర్ణాటక లో బార్ యజమానులంతా కలసి, తాము తమ బారులలో స్తిలను వెయిటర్ లు పెట్టుకుని కస్టమర్ లకు కిక్కు ఎక్కిస్తుంటే, ఓర్వలేని పోలిసులు అడ్డు చెపుతున్నారని, హైకోర్టు వారిని ఆశ్రయించారట. హై కోర్టు వారు కూడ వారి సమస్యను సానుభూతితో పరిశిలించి, బార్ లలో "వేచివుండే"(వెయిటర్స్) వారి గా స్త్రీలను నియమించుకోవచ్చని ఆర్డర్ ఇచ్చారట. కాకపోతే కొన్ని నిబందనలు పాటించమని చెప్పే అధికారం ప్రభుత్వానికి ఉందని హై కోర్టు వారు అంటే, దానికి కూడ బార్ యజమానుల తరపు లాయర్లు లా పాఇంట్ తీసి అబ్యంతరం చెపితే, ముందు ట్రైల్ వెయ్యండి. తర్వాత మీ సాదక బాదకాలు గవర్నమెంటు తో చెప్పి సమస్యను పరిష్కరించుకోవచ్చు. అని సెలవిచ్చారట గవర్నమెంట్ తరపు వకీలు గారు. మొత్తానికి కన్నడ బార్ యజమానులు స్తి వెయిటర్ ల కోసం చేసిన పోరాటం లో విజయం సాదించారు అన్న మాట!.

   కొంచెం వేలు పెట్టే సందు ఇస్తే చాలు, కాలు ఎలా పెట్టాలో అధికారులే చెపుతారు కాబట్టి, కన్నడ బార్ యజమానుల వీర విజయ గాద మన రాష్ట్రం వారిని కూడా ఉత్తేజపరచవచ్చు. ఎదో ఒక రోజు  మన రాష్ట్ర బారులలో కూడ బార్ గర్ల్స్ ధర్శనమిస్తారు కాబోలు. అసలే కోతి ఆ పై కల్లు తాగింది అనే స్సామెతలో లాగా ఒక పక్క గ్లాసుల్లో పోసిన మద్యం కిక్కు ఎక్కిస్తుంటే, అధి పోసే చేతులుకు గాజులు ఉంటే ఇక ఎక్కే కిక్కు ఎలా ఉంటుందో, మందు బాబులు ను అడిగితే చెపుతారు.
            ఈ దేశ దౌర్బాగ్యం ఏమిటో కాని, ఒక పక్క ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటారు. ఇంకొక పక్క మద్యం సప్లై చెయ్యడానికి బార్లలో ఆడవాళ్ళు ఉండొచ్చు అని అనుమతులిస్తుంటారు. ఇది ఇక్కడితో ఆగుద్దని ఊహించడం కష్టమే. ముందు బార్లు లలో ఎంటర్ అవమంఅంటారు. చిన్నగా పర్మిట్ రూమ్ లలో కూడ పడతులకు అవకాశం ఇస్తే ఇక జనాలకు మజాయే, మజా!. ఇంట్లో సంసారం కంటే వీదీ సరసాలు మీద మక్కువ  చూపే సగటు భారతీయ మగవాడి మనస్తత్వాన్ని, గుర్తించి వ్యాపార వాదులు విసురుతున్న ఈ భయంకర వలకు తాగుబోతుల  కుటుంభాలు చిక్కుకుని చిన్నా భిన్నం కాక తప్పడు.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన