"సర్రోగసి మదర్స్" కి ఆస్తిలో "సముచిత వాటా" ఇస్తే సరి!.


                                                            
                                                              
  మన సాంప్ర దాయంలో ఒక విదానం ఉంది. అదేమిటంటే,పుత్ర  వారసులు  లేని వారు చనిపోతే, ఆడపిల్లలు కొరివి పెడితే చనిపోయిన వారి ఆత్మ   "వైతరణి" దాటదు కాబట్టి, దగ్గరి బందువులలో ఎవరైనా మగవారి చేత కొరివి పెట్టిస్తుంటారు. అలా కొరివి పెట్టినందుకు వారికి త్రుణమో పణమో ఇస్తుంటారు. అంతే కాక కొరివి పెట్టే అధికారం వలననే "జ్యేష్ట" , కనిష్ట బాగాలు కూడా ఉంటాయి. అంటే పెద్దవాడు తండ్రికి, చిన్నవాడు తల్లికి కొరివి పెట్టే అధికార ముంటుంది కాబట్టి ఇలా ఏర్పాటు చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ఒకరూ, లేక ఇద్దరు చాలు అనేది సాంప్రదాయం అయింది కాబట్టి, ఆ బాగాలు అనేవి వివాదాస్పదం కాకపోవచ్చు.

  ఇక పోతే ఇప్పట్టి దాక మన కుటుంభ సంబందాలలో లేని రక్త బందువు ఒకరు కొత్తగా చేరిపోయారు. కాక పోతే మన వారికున్న డబ్బు వారిని "కిరాయి అమ్మ" లు గా మార్చి, తొమ్మిది నెలల టెంపరరి రేలేషన్ గా మార్చి వేసింది. వారే "సరోగసి మదర్స్".ఎవరైనా కొడుకు బాగా వేదిస్తుంటే, కన్న తల్లి అనే మొదటి మాట "నిన్ను నవ మాసాలు మోసి కన్నానురా,అంత మాత్రం క్రుతజ్ణత లేదా"? అని ఆక్రోశం వెళ్ల గ్రక్కుతుంటారు. కాని సరోగసి ద్వారా సంతానం పొందిన మదర్స్ కి ఆ మాట అనే అవకాశం లేదు .ఆ డైలాగ్ మీద పేటెంట్ రైట్ "సరోగసి మదర్" కే ఉంటుంది. మరి అటువంటి మదర్ కి కేవలం కిరాయి ఇచ్చి జన్మం పొందటం ఎంత అన్యాయం!

 చచ్చినా వారికి కొరివి పెడితేనే వాటాలు ఇచ్చే సాంప్రాదయం ఉన్నవారు, కొడుకు లేక కూతురు ఆస్తిలో జన్మం ఇవ్వడానికి కష్ట పడిన "సరోగసి మదర్" కి అంతో ఇంతో వాట ఇచ్చి, గౌరవించడం సముచితంగా ఉంటుందనుకుంటా. ఇలాంటి నిబందన చూడటానికి సిల్లీగా అనిపించినా, బవిష్యత్తులో వేలం వెర్రి "సరోగసి" కాన్పులకు అడ్డకట్ట వేస్తుంది. సైన్స్ విజ్ణానం పుణ్యామాని, సహజ ప్రక్రియలో సంతానం పొందలేని వారిట ఒక వరంగా "సరోగసి" ఆవిష్కరింపబడింది. కాని దేనిలో నైనా  మంచి కంటే చేడుకే ఎక్కువుగా ఆకర్షించబడతారు కాబట్టి, రేపు డబ్బున్న వారు, ఎక్కడ అందం చెడిప్టుందనో, లేక తొమ్మిది నెలలు కష్టపడతం ఎందుకు, డబ్బు పడేస్తే అద్దె అమ్మలు దొరుకుతున్నప్పుడు అనీ బావించే వారు, ఈ ప్రక్రియను కోరుకుంటే అప్పుడు "సరోగసి" పెద్ద బిజినెస్ అవుతుంది. డాక్టర్లు కూడ తమ డెవలెప్మేంట్ కొరకు వెనుకా ముందూ ఆలోచనా లేకుండా కాసులకు కక్కుర్తి పడి చేతనైన స్తిలను  కూడ "చేత గాని అమ్మలుగా" సర్టిఫికెట్ లు ఇచ్చి, సరోగసిని శాయశక్తులా అభిరుద్ది చేస్తారు. అప్పుడు సామాజిక వాదులు ఎంత లబో దిబో మన్నా పలితం ఉండక పోవచ్చు. కాబట్టి పైన తెలిపిన "వాటా నిబందన" పెడితే ఆ వాటని రక్షించు కోవటానికైనా "సహజ ప్రక్రియలు" కు సిద్ద పడతారు అర్హత ఉన్న వారు. సరే అ బాగ్యం లేని వారు "సరో గసి" ని ఆశ్రయించక తప్పదనుకోండి. తప్పనప్పుడు వాటా ఇచ్చినా తప్పు లేదుగా?

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )