సోనియా గాంది, తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకుంటుందా !?

                                                               



K.C.R. గారు ఆంద్రా నాయకులను తెలివిగా అడకత్తెర లో ఇరికించి తెలంగాణా రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడు అని చెప్పవచ్చు. తెలంగాణా వారు  రాజకీయంగా  పావులు కదపటంలో  చాణక్యుడికి ఏ మాత్రం తీసి పొరని K.C.R. నిరూపించాడు . అటు అధిష్టాన దేవతని ప్రసన్నం చేసుకోవడంలో సపలిక్రుతుడు అవ్వడమే కాక , తన చాకచక్యంతో ఆమె నైజం ఎరిగి, కూల్ గా ఆమె చేత తెలంగాణాకు  o.k అనిపించాడు .. కొన్నాళ్ళు సునామిలా విరుచుకు పడుతూ ,మరి కొన్నాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించే  k.c.r. లో అపర చాణక్యుడు ఉన్నాడనటo  లో అతి శయోక్తి లేదు .

  ఏమిటి ! k.c.r. గారిని ఇంతలా పోగుడుతున్నాను అనుకుంటారా? అవును మరి. ఈ రోజున తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎవరు ఎన్ని కారణాలు చూపించిన ముక్య కారణం సోనియా గాంది గారి మాట. అవును ఖచ్చితంగా ఆమె తెలంగాణా ప్రజలకు తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన మాటే ఈ రోజు తెలంగాణా ఏర్పడటానికి కారణ మవుతుంది తప్పా వేరేది కాదు. సోనియా గాంది గారి నైజం ఎరిగిన k.c.r. గారు ఆమె పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 వ తారికున తెలంగాణా ప్రకటన చేసేలా చాలా కసరతు చెసాదు. అందులో బాగమే ఆయన గారి పదిరోజుల నిరాహార దీక్ష కదా కార్యక్రమాలు . ఇవ్వన్ని అధిష్టాన దేవత అంగీకారంతో జరిగినవె. ఆ రోజు భారత హోం మంత్రి చేత ప్రకటన చేయించాక ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిపొఇదనుకున్నాదు.

   అంతే !అప్పటి దాక తెలంగాణా ఇస్తే మాకేమి అబ్యంతరం లేదని బింకపు మాటలు మాట్లాడిన ఆంద్ర రాజకీయ దిగ్గజాలు ఒక్క సారిగా నివ్వెర పొయారు. అప్పటి దాక తెలంగాణా  ఇవ్వడం అనేది అయోధ్యలో  రామాలయం  కట్టడం లాంటిది అనుకున్న అంద్రా వారు ఒక్కసారిగా ఆంద్రా ప్రజలు నిరసన తెలపడంతో అయోమయానికి గురిఅయి ఒక్క సారిగా మూకుమ్మడి రాజీనామాలు చేసే సరికి  ఈ సారి  తెల్లబోవడం సోనియా గాంది గారి వంతయింది . అదేమిటి ! అంతకు ఒక్క రోజు మునుపే ఒక్క c.p.m. వారు తప్పా ,అందరూ తెలంగాణా ఇస్తే తమకేమి అబ్యంతరం లేదని రాత పూర్వకంగా తెలియ చేసి ,తెల్లారి ఇచ్చేసరికి ఇలా మాట మార్చడం ఇటాలియన్ సోనియా గారికి అస్సలు అర్ధం కాలెదు. ఈ రోత రాజకీయాలు చూసి ఆమెకు అసహ్యం కూడా వేసి ఉండవచ్చు. కాని రాష్ట్ర రాజకీయాలలో అనుబవమున్న వారు ఇచ్చిన సలహాతో కావచ్చు తాత్కాలికంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆపి ఉంటారు

      భారత దేశం వంటి పెద్ద దేశానికి చెందిన అదికార పార్టికి ఆమె అధిష్టాన దెవత. ఆమె మాట ఇస్తే తప్పుకునే రకం కాదు.అందులో తన పుట్టిన రోజున నాలుగు కోట్ల మంది ప్రజలకు అందరి ఆమోదం తో ఇచ్చిన మాట అది. అది ఆమె జన్మదినo   నాడు ఇచ్చిన వరం . అటువంటి దానిని ఆమె వెనుకకు తీసుకుంటుందా? తీసుకుని తన చరిత్రలో ఒక మచ్చని ఏర్పర్చుకుoటుందా ? నెవ్వర్! ఇది తెలిసిన వాడు కాబట్టే k.c.r నిమ్మకు నిరేట్టినట్లు ఉంటూ తన పాంహౌస్ లో కాలం గడుతున్నాడు . అది తెలియని వారు డబల్ గేం రాజకీయాలతో ఇంకా ప్రజల్ని మబ్య పెట్టాలని చూస్తున్నారు .. నాన్నా పులి వచ్చె కదలొ కొండయ్య కొడుకు లాగ పిల్ల చేష్టల రాజకీయాలతో ఆటలాడిన రాజకీయ నాయకులు ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటును కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్పా , అసలు ప్రజల మనో బావాలు ఏమిటి ? వాటిని తెలియ పరచడంలో పార్టి సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా ఎలా వ్యవహరించాలి అనేది ఇప్పటికి వారికి అవగతం అయినట్లు లెదు.  నైతిక విలువలతో  కూడిన రాజకీయాలే మన రాష్ట్రానికి , దేశానికి శ్రీ రామ రక్ష అని రాజకీయ వాదులు గ్రహిస్తే మంచిది . అలా ఒకే మాట మిద వ్యవహరించిన  T.R.S.,C.P.M, పార్టీలకు అభినందనలు . డబల్ గేం రాజకీయ నేతల నైజంతో ప్రజల మనో బావాలు సరిగా వెల్లడి కావు అనటానికి చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణ గా మిగిలి పోనుంది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు. ఇప్పటి కైనా ప్రజలు మాటలు చెప్పే వారిని కాక మాట మిద నిలబడే వారిని ఆదరిస్తే సర్వ విధాలా శ్రేయో స్కరమ్.

  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!