సోనియాజీ తో గేమ్స్ ఆడితే రెండుగా విడిపోవాల్సిందే !

                                                           
      

"మంచీ చెడు తెలిసి కూడ చెప్పలేని పెద్దలు ఎవ్వరికీ ఏమీ  కారు, ఏమీ చెయ్యలేరూ " అన్నాడో సినీ కవి. చెప్పక పోతే చెప్పక పోయారు, కనీసం తమకేమి అవసరం లేదని ఊరుకున్నారా అంటే  అదీ లేదు . మీరిస్తే మాకేమి అబ్యంతరం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు . తీరా వీరు చెప్పేది ప్రజలందరి అభిప్రాయమే అనుకుని తెలంగాణా ఇవ్వడానికి సిద్ద పడుతుంటే ఇప్పుడు దానిని ఆపటం ఎలాగా అని మల్లగుల్లాలు పడుటున్నారు.

  వీరిని చూస్తుంటే ఎదో సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ లు గుర్తుకు వస్తున్నాయి. "ఖాన్ తో గేమ్స్ అడకు  శాల్తీలు  లేచి పోతాయి " అని ఒక పంచ్ డైలాగ్ ని ఊత పదం గా వాడుతుంటాడు . ఇక్కడ తెలంగాణా విషయంలో మింగలేక, కక్కలేక "ఇవ్వమంటే ప్రజలతో తంటా , వద్దంటే సోనియా అమ్మతో తంటా " అని మదనపడుతూ , ఎవరిని ఏమనలేక "అత్త  మీద కోపం దుత్త మీద చూపించినట్లు " ప్రతి పక్ష నాయకులు వద్దని చెపితే సోనియా తెలంగాణా ఇచ్చేదే కాదు అని సమర్దించుకుంటుంటే , వారి అసమర్ధపుమాటలకు  నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్తితి సమైఖ్య వాదులది.

  ఒక రాష్ట్రాన్ని విబజించడమన్నది పూర్తిగా పరిపాలనా సౌలబ్యం దృష్ట్యా కేంద్ర ప్రబుత్వం వారు తీసుకోవలసిన నిర్ణయం . దానికి సంబందిత రాష్ట్ర అసెంబ్లి తీర్మానం అనేది నామ మాత్రమే .కేంద్ర ప్రబుత్వం వారి తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే ఎవరూ వద్దన్నా రాష్ట్ర విబజన తప్పదు .భారత దేశంలోని ఏ ప్రాంతం వారైనా తాము పలాని ప్రాంతం వారితో కలసి ఉంటామని కాని, లేక కలసి ఉండమని కాని చెప్పే హక్కు భారత రాజ్యాంగం తన ప్రజకు ఇవ్వలేదు. కేవలం అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ మీదే కేంద్రం ఆ పనిని చెయ్యగలదు . మరి ఇటువంటి దానికి ప్రజల్ని రోడ్డు  మీదకు వచ్చేలా చెయ్యాల్సిన అవసరం అధికార పార్టి ఎందుకు కలిపించింది . ?  ప్రజల మద్య వైష్యమాలు కల్పించి ఒక ప్రాంతం వారి మీద మరొకరు కారాలు మిరియాలు నోరుకునేలా చేసి ఇప్పుడేమో సాయుడ బలగాల పహారాలో రాష్త్రం విబజిస్తే ఇది ఇంతటితో సద్దుమణుగుతుందని బావిస్తునారా ?ఏమో మరి కాలమే దీనికి పరిష్కారం చెప్పగలదు .

     ఐ విషయంలో సోనియా గాందీ గారి తప్పేమి లేదు . కేవలం కొంతమంది రాజకీయ నాయకుల డబల్ గేమ్స్ వలన రాష్ట్ర విభజన రాష్ట్ర ప్రజలందరికి ఇష్టమని బావించే, ఆమే గారు రాష్ట్ర విభజన విషయం లో సీరియస్ స్టాండ్ తీసుకున్నట్లు కనిపిస్తుంది . అధిష్టానాన్ని కాదని  ప్రజాభీష్టం ప్రకారం పాలన సాగించ గల నాయకులు ఎవరూ కాంగ్రెస్ పార్టిలో లేరని సోనియా గారికి బాగా తెలుసు. . ఎలాగూ  b.j.p  పార్టి వారు కూడా  విభజనకు అనుకూలమే కాబట్టి వారికి ఎట్టి పరిస్తితిలో రాష్త్ర విబజన చాన్స్ ఇచ్చి, తెలంగాణా ప్రజల ద్రుష్టిలో హీరోలుగా చెయ్య రాదనే సోనియా జీ ఐ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు . అంతే కాకుండా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సోనియా గాందీ గారి పుట్టిన రోజున జరిగింది కాబట్టి ఇది ఆమెకు ప్రెస్టేజ్ ఇస్స్యూ కూడా . ఆమె ముందు వక మాట , వెనుక వక మాట చెపితే ఊరుకునే వ్యక్తీ కాదు అనిపిస్తుంది . ఖాన్ తో గేమ్స్ ఆడితే ఏమి జరుగుద్దో తెలియదు కాని,సోనియా జీ తో గేమ్స్ ఆడితే రెండుగా విడిపోవాల్సిందే ! రాష్త్రం!
                                                                                                                                    





Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!