Posts

Showing posts from September, 2016

చీ..చీ..చీ,, ఇంత ఘోర కలి ఈ భూమి మీద ఉందా!?

Image
ఇటువంటి సంఘటనలు గురించి చెప్పాలంటే మనస్కరించడం లేదు. ఎంతో మందిని  ఎన్కౌంటర్ చేయగకలిగిన పోలీస్ వారు, ఎందుకు ఇటువంటి కేసుల నిందితుల పట్ల ఉపేక్ష వహించి, కోర్టు విచారణల పేరుతో కాలయాపన చేసి, నిందితులకు జీవించె హక్కు కల్పించడం?మీకు చేతకాకపోతే వారిని ప్రజల మద్యకు పంపించండి. వారే విదిస్తారు తగిన శిక్ష. రాజ్యాంగరక్షణ అనేది మనుషులకు మాత్రమే.జంతువులకు కూడ ఇవ్వొచ్చు. కాని మానవ రూపంలో ఉన్న మ్రుగాలకు మాత్రం ఎట్టి పరిస్తితుల్లో ఇవ్వ రాదు. అవసరమైతే వీరి కోసం షరియా చట్టాలు మాదిరి అమలు చేసినా తక్కువే!.

   నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షానికి ఒక ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి వచ్చి తన గోడు వెళ్ళ బోసుకుంటుంటే అక్కడ ఉన్నవారంతా కొయ్యబారీ పోయారట. ఆ అమ్మాయిని గత తొమ్మిదేళ్ళుగా, అమ్మాయి తండ్రి, అన్న ఇద్దరూ అత్యాచారం చేస్తూ, తమ పశువాంచ ను తీర్చుకుంటున్నారట. దానికి ఆ తల్లి వత్తాసు కూడ ఉందట. దీని మీద స్పందించిన లక్నో పోలిసులు నిందితులను అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఇటువంటి  సంఘటణ జరిగిందంటే అసలు నమ్మ బుద్ది కావటం లేదు. మనిషి పూర్తిగా మ్రుగత్వ వాసనలు నుండి బయటకు రాలేదనటానికి ఇదొక తార్కానం.దీని గురించి వివరం…

రిజర్వేషన్ లు అంటే ఆగ్రహం వెలిబుచ్చే వారంతా "రెండో రకం మెదడు " వారేనా ??!!!

Image
ఈ  దేశం లో రిజర్వేషన్ సిస్టం మీద కారాలు మిరియాలు నూరేవారు , ఈ  మద్య ఎక్కువుగా సోషల్ మీడియాలలో హల్  చల్ చేస్తున్నారు. కుల ప్రాతిపదిక న రిజర్వేషన్ లు వద్దని , ఆర్దిక ప్రాతిపదిక న రిజర్వేషన్ లు అమలు చేయాలని ఒక విచిత్ర వాదాన్ని వారు ముందుకు తెస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్దిక ప్రాతిపదిక పరంగా ఆర్దికంగా విద్యార్దులకు సహాయం చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. కాని ఇది చాలదు అని ఉద్యోగాలలో కూడా ఆర్దిక ప్రాతిపదిక మీదే రిజర్వేషన్లు కల్పించాలని అడ్డగోలు వాదం చేయడమే కొంచం ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. ఈ  విషయం లో రాజకీయ నాయకులు మౌనంగా ఉండి తమాషా చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క సారి రిజర్వేషన్ ల తుట్టె ను కదిపితే ఏమి జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే కొంతమంది పిల్లలను రెచ్చగొట్టి , వారిని ముందు పెట్టి వీరు తెర వెనుక బాగోతం నడుపుతున్నట్లు అనుమానంగా ఉంది.  ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఈ విషయం మీద ఎక్కువుగా స్పందిస్తున్న తీరు చూస్తుంటె , వారి వెనుక ఉన్న వర్గాల స్వబావం తెలుసుకోలేనంత మూర్కులు కారు, మెజార్టీ  రిజర్వేషన్ అనుకూల వర్గాల వారు.

                       …

'డ్రైవర్ రాముడు' లు కంటే "డ్రైవర్ కీచక"లే ఎక్కువుగా ఉన్నారా?

Image
అవుననే అనిపిస్తుంది ఈ  మద్య  మన రాష్ట్రం లో ఆడవాళ్ళపై జరుగుతున్నా అత్యాచార సంఘటనలు చూస్తుంటే.ఆంద్రుల అభిమాన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక సినిమానలో, లారీ డ్రైవర్ పాత్రలో నటించి డ్రైవర్ అనే వాడికి ఒక హీరో ఇమేజ్ ఇచ్చి సినిమాను సూపర్ డూపర్ చేసాడు. అదే "డ్రైవర్ రాముడు". అలాగే బాషా అనే సినిమాలో హీరో రజనీ కాంత్ కూడా  ఆటో డ్రైవర్ పాత్ర పోషించి, ఆటొ డ్రైవర్ లకు ఒక హీరో ఇమేజ్ ఇచ్చారు.కానీ వాస్తవ జీవితంలోకి వస్తే మనకు కనిపిస్తున్న వారు "డ్రైవర్ కీచక" లే! . డిల్లీ నిర్భయ కేసు లో , ఆంద్రా అభయ కేసు లో కూడా  దోషులు ,నిందితులు డ్రైవర్లే కావడం గమనార్హం.

    హైద్రాబాద్లో అభయ కేసు జరిగిన తర్వాత ఖమ్మంలో కూడా  ఒక వివాహితపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసారట !ఖమ్మం పట్టణం ప్రక్కనే ఉన్న రఘునాద పాలెంలో ఒక వివాహిత తన అమ్మమ దగ్గర ఉంటుంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమె తన భర్తతో గొడవపడి వచ్చి తన అమ్మమ దగ్గర ఉంటుందట. ఆమె కుమార్తె దసరా సెలవులకు ఆమె చెల్లెలు వద్దకు వెలితే , సెలవులు అనంతరం అమ్మాయిని తీసుకురావడానికి అమ్మమ్మ  వెళ్లిoదట. ఆ రోజు ర…

సెల్ లో బొమ్మలు చూసి చొంగ కార్చుకొవటం తప్పా పెండ్లి చేసుకునే దమ్ము లేదు !పిల్లల్ని కని పెంచే దమ్ము అస్సలు లేదు !

Image
చదువా ,చదువా ప్రజలకు ఏమి నేర్పావే అంటే , "స్త్రీలను స్త్రీలు ,పురుషులని పురుషులు పెండ్లి చేసుకోవడం ఎలాగోనేర్పాను "అందట ! మితిమీరిన స్వేఛ, ఆదునిక జీవన శైలి విద్యా వంతులైన యువతను అసమర్డులుగా మార్చి వేస్తున్నాయి . వెనుకటి తరం వారు సంపద   ఉన్నా ,లేకపోయినా పిల్లల్ని కనడం లో వెనుకంజ వేసేవారు కాదు .కారణం ఎంత మంది పిల్లలు ఉంటే అంత సంపద గా పరిగనించేవారు కాబట్టి . కాని ఇప్పుడో ! నెలకు పాతిక వేలు తెచ్చుకునే ఉద్యోగి కుడా ఒక పిల్లని మించి కనాలంటే వెన్నులో ఒణుకు పుడుతుంది . అదే ఆడ పిల్లయితే నవ నాడులు క్రుంగి పోయేంత బయం . అదీ అదునికుల బ్రతుకులు ! దీనికే తెగ ముర్రిసి పోతూ "స్మార్ట్ సిటి ",లు మావి ,స్మార్ట్ బ్రతుకులు మావి అంటున్నారు .

  ఇక ఎక్కువుగా చదువుకున్న విద్యావంతులైతే అసలు పెళ్లి వద్దు ,పెళ్ళాం వద్దు అని అంటున్నారట . అపోజిట్ సెక్స్ ను చూసి తెగ బయపడి పోతూ ,సేమ్ సెక్స్ కి అలవాటు పడిపోతున్నారు .తమ బలహీనతను ఒక హక్కు గా బావించి స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చెయండహొ అని ప్లే కార్డులు పట్టుకుని సిగ్గు లెకుండా అరుస్తున్నారు . ఇక కొంత మంది అయితే వివాహం …

కామ పిశాచులు ని " నిర్భయ" చట్టం నిరోదించలేదని తెలియచేస్తున్న "గార్ల కిరణ్మయి " ఉదంతం

Image
చట్టాలు నేరస్తులను శిక్షించ గలవు! కానీ వారిని నేరాలు చెయ్యకుండా ఆపగలవా? ఇది ఇప్పుడు సమాజంలోని ప్రతి ఒక్క మేదావి ఆలోచించవలసిన అంశం . "కామా తురాణం నభయం, న లజ్జ " అంటారు. కామంతో కళ్ళు మూసుకు పోయి ప్రవర్తించే వాడికి, ఒళ్లంతా కామ పిశాచం ఆవహించి ఉన్న వేళ , వాడికి "నిర్భయ " చట్టం గుర్తుకు వస్తుందా? చచ్చినా రాదు. పైగా పాప కార్యం అయి పోయాకా , అప్పుడు చట్టం గుర్తుకు వచ్చి, సాక్ష్యాలు దొరకకుండా ఏమి చెయ్యాలని చూస్తాడు. చివరకు బాదితురాలిని చంపడానికి కూడా  వెనుకాడడు. మరి ఇటువంటి కామ పిశాచుల నుండి అమాయకపు ఆడపిల్లలను రక్షించడానికి సమాజంలో కేవలం  కఠిన చట్టాలు ఉన్నంత మాత్రానా సరిపోదు అని  ఖమ్మం జిల్లా , గార్ల మండలం, తిర్లాపురం గ్రామం లో జరిగిన సంఘటన చాటుతుంది.

 ఆ అమ్మాయి పేరు కిరణ్మయి . వయసు 13.ఖమ్మంలో  ఎనిమిదవతరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి తమ తల్లి తండ్రులకు పొలం పనులలో సహాయం చేస్తుంది. అటువంటి అమ్మాయి ఒక రోజు ఒంట్లో బాగోలేక తల్లి తండ్రులతో పాటు చేనుకు వెళ్ళ లేక పోయింది. అదే ఆమె పాలిట శాపమయింది . పిల్ల ఒంటరిగా ఉ…

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

Image
కలి యుగం అంతానికి వచ్చినట్లే అనిపిస్తుంది ఈ  ఉదంతం వింటుంటే !చీకటి సామ్రాజ్యాల ఏలుబడి కోసం మాఫియా డాన్ లు తుపాకులు పట్టడం చూస్తున్నాం . సిద్దాంతాల అమలు కోసం తీవ్రవాదులుగా మారిన వారు తుపాకులు పేల్చడం గురించి వింటున్నాం . మతం పేరిట ఉగ్రవాదులుగా మారి మారణ హోమం సృష్టించడం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నిత్య కృత్యం గా నడుస్తున్నదే . కాని దైవ సేవలో నిత్యం రామ నామార్చన చేసే పూజారి , తను ప్రేమించిన -అది కూడా వన్ సైడ్ లవ్ అట- ప్రియురాలికి పెండ్లి చేసుకుంటే తట్టుకోలేక , ఆమె భర్తను హత మార్చడం కోసం పిస్టల్ కొని మరీ చంపాలనుకోవడం ఎంత దారుణమైన ఆలోచన!? వివరాలు లోకి వెళితే .....

   విజయవాడ దగ్గరలోని ఇబ్రహీం పట్టణం లో గల రామాలయం లో సుదర్శన రవి దత్త శాస్త్రి పూజారి . ఆయనకు వివాహం కాలేదు . ఈ  మద్య కొన్ని సామాజిక వర్గాల వారికి పెండ్లి చేసుకుందా మన్నా ఆడపిల్లలు దొరకని పరిస్తితి . అందులో రవి దత్తా సామాజిక వర్గం కూడా బాదిత వర్గం కావచ్చు . అందుకే కామోలు అయన ఏమో ఎదురింటి అమ్మాయిని ప్రేమించాడు కాని ఆ  విషయం ఆ అమ్మాయికి చెప్పలేక వన్ సైడ్ లవ్ గానే ఆమెను అరాదిoచడం మొద…

"మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?

Image
అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !

  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే  మొన్నీ మద్య సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి గారి మీద ఒక న్యాయ విద్యార్దిని లైంగిక ఆరోపణలు చేసింది. ఆమె గారు యేడాది క…

భద్రాచలం రాములు వారి ఆభరణాలు స్మగ్లర్ ల కి అమ్ముకున్నారా?!!!

Image
అవును ! సరిగ్గా ఇదే అనుమానం కలుగుతుంది ఈ  రోజు ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైన వార్తను చూస్తుంటే . పురాతన విగ్రహాలు , ఆభరణాలకు విదేశీ మార్కెట్లో బోల్డంత గిరాకీ ఉంది. మనకు మాములుగా అనిపించే వందల  ఏండ్ల నాటి వస్తువులు, కోట్ల విలువ చేస్తాయి. అందుకే ఆరి తేరిన స్మగ్లర్లు వివిధ ప్రాంతాలలోని దేవాలయాలలో ఉన్న పురాతన విగ్రహాలు ఆభరణాలు చోరీ చేయించి అయినా తమ హస్తగతం చేసుకుని విదేశీ స్మగ్లర్లకు అమ్మి కోట్లు గడిస్తున్నారు అని రికార్డులు చెపుతున్నాయి. అలాంటి స్మగ్లర్ల ప్రేరణ తోనే  ఎన్నో ఏండ్లుగా పూజలు అందుకుంటున్న భద్రాచల సీతారాములు వారి ఆభరణాలు చోరీకి గురి అయ్యాయా అనే అనుమానం నా లాంటి భక్తులకు కలుగుతుంది.
                           ఈ  రోజు ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైన వార్తా క్లిప్పింగ్ ని ఆసాంతం చదవండి. ఆభరణాలు మాయమయిన తీరు , ఎవరి మీద తీవ్రమైన చర్యలు తీసుకోకముందే తిరిగి అవి ప్రత్యక్షమైన తీరు , అలా ప్రత్యక్షమైనవి , పోయిన పాతవి కాదని , కొత్తవి చేయించి వేశారని పూజారులు అనుకుంటున్న విధానం గమనిస్తే ఖచ్చితంగా ఎదో గూడుపుఠాణి ఈ  తతంగం వెనుకాల ఉందని అనిపిస్తుంది. నిజంగా ఎదో…

ఒంట్లో "దెయ్యం " వెళ్ళగొడతానని ,ఇంట్లోనే "రేప్ " చేసి పోయిన "దెయ్యం "మాంత్రికుడు!!

Image
దెయ్యాలు మీద నమ్మక్కం ఉన్న వారికి ,  దెయ్యం అనేది  భూత వైద్యులు మాట  తప్పా,ఎవరి మాట వినదని బహు నమ్మఖ్ఖమ్ .దీనినె మూడ నమ్మక్కం అంటారు అంతో ఇంతో సైన్స్ తెలిసిన వారు ."దెయ్యమ్, భూతం అనే బావనలు ఒక రకమైన మానసిక సమస్యలు,వాటికి పరిష్కారం చూపగలిగేది ఆధునిక వైద్య పద్దతులు మాత్రమె "అని విజ్ఞాన బాబులు ఎంత చెప్పినా ,అజ్ఞాన జనం అంగీకరించటానికి సిద్దంగా లేరు . కారణం వారిలోని విజ్ఞాన లేమి కావచ్చు ,లేకుంటే భూత వైద్య ప్రక్రియల ద్వారా లబ్ది పొందిన వారి అనుభవాలు కావచ్చు . ఎది ఎమైనా దెయ్యం అనేది ఒక నెగటివ్ బావన .ఆ బావనను మనసు నుండి తొలగించడమే భూత వైద్యుడైన ,ఆధునిక మానసిక వైదుడైన చేయాల్సిన పని .

       పెద్ద పెద్ద పూజా సెటింగ్ లతో కూడిన పూజలు చేస్తూ ,మనిషిలోని దెయ్యం అనబడే "నెగటివ్ పీలింగ్ "ని పోగొట్టి తిరిగి పూర్వ స్తితికి వచ్చాం అన్న బావన ,రోగి లో కలుగ చెయ్యడంలో సపలీ క్రుతమయినపుడు ,మనిషికి పట్టిన దెయ్యం వదిలి వెళ్ళినట్లు లెక్క .దీని కయ్యే ఖర్చు భూత వైద్యం లో అయితే వందల రూపాయలే ఉంటుంది . అదే ఆధునిక వైద్యం ,మానసిక రోగి కి వైద్యం చెయ్యడానికి కౌన్సిలింగ్ లతో పాటు కొన్ని మందులు కూదా ఇవ్వ…

ముగ్గురు అమ్మాయిలతో ఇరవై మంది అబ్బాయిలు ఎంజాయ్ చెసే "కుక్కల సంస్క్రతి" ని "రేవ్ పార్టీ" అంటారట!

Image
ఎవరు ఎన్ని కహనీలు చెప్పినా , స్త్రీ లు అనాదిగా బానిసలుగా మారడానికి "మను వాదమే " కారణమని ఆదునిక స్త్రీ వాదం గొంతులు చించుకుని సాదించిన అబ్యుదయ సమాజం లో కూడా  స్త్రీల పరిస్తితి "ఆటబొమ్మే" అని చెప్పక తప్పదు. స్త్రీ ల ఇష్టానికి వ్యతిరేకంగా వారి పై లైంగిక దాడి చేస్తే అది "రేప్" . దానికి కఠిన శిక్ష ఉంది. మరి  ఒక స్త్రీ పదిమందితో ఇష్టపూర్తిగా లైంగిక కార్య కాలపంలో పాల్గొంటే దానినేమంటారు ? "రేవ్ పార్టి " అంటారా ! మరి కుక్కల సంస్కృతిని తలపించే ఈ  రేవ్ పార్టిలలో పాల్గొనే వారికి కఠిన శిక్షలు అవసరం లేదా? కేవలం ఏదో న్యూసెన్స్ కేసుల క్రింద విచారించి వదిలేస్తే సరి పోతుందా?

        మొన్న శనివారం రంగా రెడ్డి జిల్లా పరిగి మండలంలో ఒక ఫాం హౌస్ మీద దాడి చేసి న పోలిసులు మొత్తం ఇరవై మందిని అరెస్ట్ చేస్సారు. అందులో ముగ్గురు యువతులు కాగా తక్కిన వారు యువకులు . వీరంతా రేవ్ పార్టీ జరుపుకుంటున్నారట! రేవ్ పార్టీ అంటే అచ్చ తెనుగులో గానా బాజానాలతో కూడిన 'మందు , విందు ,పొందు " పార్టీలు . ఈ  మద్య హైదరాబాద్  పర…

ఈ "లేచి పోయిన రాజేశ్వరి " మోసపోయిందట ? అవ్వ! అవ్వ!

Image
భారత రాజ్యాంగం అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులు తో పాటు సమానులే అని చెపుతూ,ఒక నేరం విషయం లో మాత్రం స్త్రీ పక్ష పాతి అనిపించుకుంది . అదే ఇండియన్ పీనల్ కోడ్ లోని "అడల్ట్రీ" సెక్షన్ . సెక్షన్ 497 క్రింద ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం  ,పరాయి వారి భార్యతో  సెక్సువల్ సంబందం ఉన్ననిందితులకు 5 సంవత్సరాలు కారాగార శిక్ష విదించ వచ్చు .కాని అ భార్యను మాత్రం పల్లెత్తు మాట అనటానికి వీలు లేదు . ఎందుకంటె 'స్త్రీలు చెడగొట్ట బడతారు తప్పా ,చెడి పోరు '  అని భారతీయ చట్ట నిర్మాతలకు బహు నమ్మక్కం కాబోలు . అ బావనే  మన ప్రింట్ మీడియా ,ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ఉంది . అందుకే మొన్న జూబ్లి హిల్స్ లో జరిగిన ఒక  అడల్ట్రీ కేసు విషయం లో స్త్రీ ని బాదితురాలిగా ,పురుషుడిని నీచ్ కమిన్ గా చిత్రి కరించి వార్తలు ప్రచురించారు . వివరాలు లోకి వెళితే ,

  యుసుప్ గూడ ప్రాంతం లో ఒక ట్రాఫిక్ S I గారు నివసిస్తున్నారు .ఆయనకు 50 + ,ఆమెకు 48 అంట . పాపం మన పోలిస్ లకు వర్క్ లోడ్ ఎక్కువ కాబట్టి సదరు S I గారికి ఇంటి గురించి పట్టించుకునే తీరిక తక్కువ అనుకుంట .కాని అయన సహా ధర్మ చారిణికి మాత్రం బోల్డంత తీరిక కాబోలు 'పే…

ఇదే పనిని ఏ హిందువైనా చేసిఉంటే ఎంతమంంది ఎగబడేవాళ్ళొ ?!!!

Image
ఆతను చేసింది ముమ్మాటికి తప్పే! ఎక్కడా ? చట్టం ద్రుష్టిలో. కాని అతని మతానికి చెందిన చాలా  ద్రుష్టిలో మాత్రం ఆతను చేసినది కరెక్టు . ఎందుకంటె తమ మత సూత్రాలు అనుమతించని దానిని తమ మతానికే చెందిన ఆ  అమ్మాయి చేస్తుంది. అదేమిటంటే కురచ దుస్తులు దరించి పబ్లిక్ గా ప్రదర్శనలు ఇస్తుంది. దానిని చూస్తున్న ఆ మతస్తుడికి అస్సలు నచ్చలేదు . తన నిరసనను ఆమెకు తద్వారా ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. అలా తెలియచేయడం నాగరిక పద్దతిలో జరిగితే బాగుండేది . కాని అతనిలోని మత వాది "ఆఫ్ట్రాల్ ఆడదానికి నాగరిక పద్దతిలో నిరసన తెలియ చెయ్యాలా ?" అని హుంకరించాడు. అంతే! అందరు చూస్తుండగా రియాల్టి షో జరిగే  వేదిక మీదకు చట్టుకున  ఎక్కి ఆ వర్ధమాన నటి చెంప చెళ్ళు మనిపించాడు . తమ మతానికి చెందిన దానివి ఇలాంటి కురచ దుస్తులు వేసుకుని పబ్లిక్ గా తై తక్క లాడడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డాడు .ఆ అమ్మాయి పాపం బిత్తరపోయింది . అక్కడ ఏమి జరుగుతుందో జనానికి అర్ధమయ్యే లోపు అంతా జరిగిపోయింది .  ఆ తర్వాత పోలిసులు అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు . తర్వాత చట్టం తన పని తానూ చేస్తుంది కాబ…

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

Image
ఖమ్మం నగరానికి చెందిన 15 ఏండ్ల అమ్మాయి జూన్ 25 నుంచి కనపడటం లేదని ఆమె తల్లి తండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయటమే కాక , కనపడిన వారికల్లా చెప్పుకుంటూ కళ్లనీళ్లు పర్యంతమయ్యారు. చివరకు పోలీసులు ఆ అమ్మాయిని , ఆ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు అని చెపుతున్న ఆమె ప్రియుడిని పట్టుకుని , ఆమెను తల్లి తండ్రులకు అప్ప చెప్పి , అతడిని కటకటాల్లోకి   పంపించారు. ఆమె వయస్సు 15 కాబట్టి ఆమె ప్రియుడు చేసుకున్న పెండ్లి చట్ట ప్రకారం నేరం కాబట్టి అతడి మీద కేసు పెట్టాల్సి వచ్చింది . విషయం ఇంతవరకే అయితే ఇదేదో రొటీన్ కదిలే అని సరి పెట్టుకోవచ్చు. కానీ అంకంటే ఘోరమైన పని ఆ పిల్ల జీవితం లో జరిగింది.

     ఆ అమ్మాయి ప్రేమించింది ఆటో డ్రైవర్ ని. వారిద్దరూ లేచిపోయి పెండ్లి చేసుకుందామనుకున్నారు అట. ఆ రోజు ఆమెను తీసుకు వెళ్ళడానికి ప్రియుడు ఎందుకు రాలేదో తెలియదు కానీ , ఆ అమ్మాయే సోందు అనే వాడి ఆటో మాట్లాడుకుని ప్రియుడి దగ్గరికి వెళుతుంటే , ఆ సోందు , మరో ఇద్దరు కలసి ఆమె పై ఆ రాత్రంతా అత్యాచారం చేశారు అట. ఆ తర్వాత ఆమెను వదిలేస్తే ఆ బాలికా కిమ్మనకుండా పోయి తన ప్రియుడికి  జరిగిన విషయం చెప్పకుండా కామ్ గా తిరుమలగిరి గుళ్లో…

మీది రేపిస్టుల దేశo, అన్న వారిని చెప్పు తీసుకు కొట్టలేకపోయారా అమితాబచ్చన్ గారూ !.

Image
విదేశీ సొమ్ముతో ఒళ్ళు పెంచుకుంటూ ,   స్వదేశ సంస్కృతీ మీద లేని పోనీ అపోహలు సృష్టిస్తూ ,తమ రాతలతో , మీడియా లో పబ్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా బాడ్ పబ్లిసిటీ ఇస్తూ , తమకు డబ్బు ఇచ్చే వారి ప్రయోజనార్థం కోసంపని చేస్తున్న కొంతమంది కుహనా మేధావులు, స్త్రీవాదులు  వలన  మన దేశానికి ప్రపంచం లో ఎలాంటి పేరు వచ్చ్చిందో తెలుసా? "ల్యాండ్ అప్ రేప్స్ " . అంటే రేప్ లు జరిగే దేశం లేక రాజ్యం అని అర్ధం. ఇది నేను అంటున్న మాట కాదు. మన దేశం లో బిగ్ బి గా పేరుగాంచిన లెజెండ్ స్టార్ ఎంతో ఆవేదనతో చెప్పిన మాట.

   అమితాబ్ బచ్చన్ గారు విదేశాలకు వెళ్లిన సందర్భంలో "మీరు ఇండియాకు , అదే ల్యాండ్ అఫ్ రేప్స్ కి చెందిన వారా " అని అడిగేవారు అంటా . దీని వలన మనకు అర్ధం కావటం లేదా? మన దేశ ప్రతిష్ట , కావాలని కొంతమంది చేసిన  తప్పుడు ప్రచారాలు వలన ఎంత దిగజారి పోయిందో? అసలు రేప్ లు అనేవి ప్రపంచం లో ప్రతి చోట జరుగుతాయి. ప్రస్తుత జనాభా దామాషా లెక్క కట్టే విధానం ప్రకారం  టాప్ 15 రేప్ కంట్రీస్ లో ఇండియాకి చోటు లేదు. జనాబా దామాషా పద్దతిలో 2 స్తానం లో ఉన్న  ఇండియా , అత్యాచారాల రేటులో వెనుకపడి ఉంది అని…

లైంగిక వేదింపులు లేకుండా ఆడవాళ్ళు ఆపీసుల్లో పనిచెయ్యాలంటే 66%శాతం మంది మగాళ్ళని జైలులో పెట్టాల్సి వస్తుందా?

Image
అవుననే అనిపిస్తుంది ఈ  ఆన్లైన్ సర్వే లు చూస్తుంటే .ప్రపంచ వ్యాప్తంగా మహిళా జర్నలిస్ట్లు తమ వ్రుత్తి రీత్యా ఎదుర్కొంటున్న "లైంగిక వేదింపులు" మీద 'ఇంటర్నేషనల్ వుమెన్స్ మీడియా పౌండేషన్',మరియు 'ఇంటర్నేషనల్ న్యూస్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ ' అనే సంస్తలు ఇటివల జరపిన ఆన్లైన్ సర్వే పలితాలు అనుసరించి నూటికి  మూడింట రెండువంతుల మంది స్త్రీలు తమ బాసులు మరియు సహౌద్యోగుల చేతిలో లైంగిక వేదింపులకు గురి అవుతున్న  వారెనట. వీరి సర్వే పలితాలు చూసిన తర్వాత ఇన్నాళ్ళు "మనువు" పుట్టిన మన దేశం లోని మగవాళ్ళు మాత్రమె స్త్రీల పట్ల తమ "మగబుద్ది" ని ప్రదర్శిస్తున్నారు తప్పా, తక్కిన దేశాల్లోని స్త్రీలు పురుషులతో పాటు సమానంగా చూడబడుతున్నారు అని నమ్మిన వారికి కను విప్పు కలగక మానదు. "మగబుద్ది " ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే అని ఈ  ఆన్లైన్ సర్వే లు వెల్లడిస్తున్నాయి.

    విచిత్రమైన విషయం ఏమిటంటే , ప్రాశ్చ్యత్య వస్త్ర దారణ వలనే మన దేశం లో లైంగిక వేదింపులు కానీ, దాడులు కానీ ఎక్కువ అయాయి అని కొంత మంది సాంప్రదాయవాదులు బావన. కాన…