ఈ "లేచి పోయిన రాజేశ్వరి " మోసపోయిందట ? అవ్వ! అవ్వ!

                                                                       

  భారత రాజ్యాంగం అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులు తో పాటు సమానులే అని చెపుతూ,ఒక నేరం విషయం లో మాత్రం స్త్రీ పక్ష పాతి అనిపించుకుంది . అదే ఇండియన్ పీనల్ కోడ్ లోని "అడల్ట్రీ" సెక్షన్ . సెక్షన్ 497 క్రింద ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం  ,పరాయి వారి భార్యతో  సెక్సువల్ సంబందం ఉన్ననిందితులకు 5 సంవత్సరాలు కారాగార శిక్ష విదించ వచ్చు .కాని అ భార్యను మాత్రం పల్లెత్తు మాట అనటానికి వీలు లేదు . ఎందుకంటె 'స్త్రీలు చెడగొట్ట బడతారు తప్పా ,చెడి పోరు '  అని భారతీయ చట్ట నిర్మాతలకు బహు నమ్మక్కం కాబోలు . అ బావనే  మన ప్రింట్ మీడియా ,ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ఉంది . అందుకే మొన్న జూబ్లి హిల్స్ లో జరిగిన ఒక  అడల్ట్రీ కేసు విషయం లో స్త్రీ ని బాదితురాలిగా ,పురుషుడిని నీచ్ కమిన్ గా చిత్రి కరించి వార్తలు ప్రచురించారు . వివరాలు లోకి వెళితే ,

  యుసుప్ గూడ ప్రాంతం లో ఒక ట్రాఫిక్ S I గారు నివసిస్తున్నారు .ఆయనకు 50 + ,ఆమెకు 48 అంట . పాపం మన పోలిస్ లకు వర్క్ లోడ్ ఎక్కువ కాబట్టి సదరు S I గారికి ఇంటి గురించి పట్టించుకునే తీరిక తక్కువ అనుకుంట .కాని అయన సహా ధర్మ చారిణికి మాత్రం బోల్డంత తీరిక కాబోలు 'పేస్ బుక్ ' కి అడిక్ట్ అయింది . ఆ పేస్ బుక్ లోఆమె గారికి 'పంతులు కామేశ్వర రావు '  ఒకడు తగిలాడు . మొదట చాటింగ్ తో మొదలు అయిన వారి పరిచయం చివరకు హాట్ కనెక్షన్ గా మారి పోయింది . ఆమె గారు చలం గారి నవల లో "లేచి పోయిన రాజేశ్వరి 'ని ఆదర్శంగా తీసుకుని 'పంతులు కామేశ్వర రావుతో ఒక పైన్ డే ఉడాయించింది . అలా ఆమె లోని సహా ధర్మ చారిణి లో "దర్మం "మరుగై పోయి ,పంతులు కామేశ్వర రావుకి  సహా చారిణి గా మారి పోయి అతనితో కలసి అక్కడక్కడ తిరిగి చివరకు మంచిర్యాలలో సెటిల్ అయ్యారు అట . ఆమెను ఒక అద్దె ఇంటిలో ఉంచి ,విటుడిలా అతను  అప్పుడప్పుడు వచ్చి పోతున్నాడు అట . అదీ ఆ లేచి పోయిన రాజేశ్వరి గారి జీవన  విదానం  .

 ఇక ఇక్కడ ఇంట్లో తన భార్య కనిపించక పోయే సరికి ఆ ట్రాపిక్ S I గారు ,జుబ్లీ హిల్స్ స్టేషన్ లో  ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసి తన భార్యను వెదికే బాద్యతను జుబ్లీ హిల్స్ పోలీసులకు అప్ప చెప్పాడు .చచ్చి చెడి వారు ఎలాగో ఆమె ఆచూకి కనిపెట్టి "పంతులు కామేశ్వర రావు " ని లోపల వేసి ,చట్ట ప్రకారం ఆమెను వదిలి వేసారు .ఇక ఆన్లైన్ పత్రికల వారు కొందరు ,"ఆమె అమాయకు రాలు .ఆమెను పంతులు కామేశ్వర రావు ట్రాప్ చేసాడు కాని ,లేకుంటే ఆవిడ గారు సీతా ,సావిత్రి అంత ఉత్తమురాలు అయ్యుండేది . నిజమైన బాదితురాలు ఆవిడే " అంటూ అవిడ గారి బోల్డంత జాలి చూపుతూ ,పంతులు కామేశ్వర రావు దే తప్పంతా అన్నట్లు కధనాలు ప్రచురించాయి .కావాలంటే ఒక 2 కధనాలు క్రింద ఇవ్వడం జరిగింది .చూడవచ్చు .

 నా అభిప్రాయం ఏమిటంటే మొగుడితో లేక పెళ్ళానితొ సరిపడక పోతే ,చక్కగా ,చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఎవరి ఇష్టం వచ్చిన వారితో, వారు సహా జీవనం చేసుకోవచ్చు . అంతే కాని 'చలం ' గారి పుస్తకాలు లో చెప్పినట్లు "లేచి పోయిన రాజేశ్వరి " లు , 'కసేక్కి పోయిన కామేశ్వర రావు'లుగా అవతారాలు ఎత్తి  చిత్త కార్తె కుక్కలుగా తిరుగుతుంటే ,ఈ నాగరిక కుటుంబ వ్యవస్థ కి  అర్ధం ఏముంటుంది ?ఇలాంటి వారికి మన అడల్ట్రి సెక్షన్ కంటె  అరబ్ కంట్రిస్ చట్టాలు లాంటివే కరెక్టు అనుకుంటా .

ఆన్లైన్ పత్రికా కధనాలు 

(1). "ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్స్ పుణ్యమా అంటూ రోజు రోజుకు అనేకానేక ఆరోపణలు వస్తున్నాయి..అసలు ఏం జరిగిందంటే...ఫేస్‌బుక్ ను వాడుకుని ఒక టీచర్..సాక్షాత్తూ పోలీసు భార్యనే ట్రాప్ చేశాడు.. ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన లేట్ గా వెలుగులోకి వచ్చింది..అసలు విషయానికి వస్తే..యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివసించే ఓ ట్రాఫిక్‌ ఎస్సై భార్య ఇటీవల కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, పోలీసుల విచారణతో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల హమాలీవాడలో నివాసించే చల్లా జ్ఞానేశ్వర్‌ కాసిపేట మండలంలోని మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో యూసుఫ్‌గూడ ప్రాంతంలో పనిచేసే ట్రాఫిక్‌ ఎస్సై భార్య(48)తో స్నేహం చేశాడు. తనకు వివాహం కాలేదని నమ్మించాడు. ఆమెను మల్కెపల్లి రప్పించి ఆశ్రమ పాఠశాలలో 15రోజులు ఉంచాడు. అక్కడ పాఠశాల సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో మంచిర్యాలలో ఓ అద్దె ఇంట్లో ఆమెను ఉంచి తరచూ వచ్చిపోయేవాడు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలు మంచిర్యాలలో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొనిజూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జ్ఞానేశ్వర్‌కు గతంలోనే వివాహమైందని, ఒక కుమార్తె కూడా ఉందని విచారణలో తేలింది. నిందితుణ్ణి పోలీసులు జైల్లోకి తోసేసారు."


  (2). "ఏకంగా ఎస్సై భార్యతోనే సహజీనం చేస్తున్న ఉపాధ్యాయుడి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితె ఫేస్ బుక్ లో పరిచయమైన వివాహిత కు ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో వల వేసి సహజీవనం చేస్తున్నాడు. నిందితుడిని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన ఓ ట్రాఫిక్ ఎస్సై భార్య ను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో నివాసం ఉంటూ కాసిపేట మండలంలోని మల్కేపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చల్లా జ్ఞానేశ్వర్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెకు వల వేసి మంచిర్యాల తీసుకెళ్లి పద్మావతి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నాడు. తన భార్య కనిపించడం లేదంటూ ట్రాఫిక్ ఎస్సై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత శుక్రవారం మంచిర్యాల వెళ్లి సదరు వివాహితను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైందని జ్ఞానేశ్వర్ విషయం వెల్లడించాడు. తన భార్యకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వివాహిత భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు జ్ఞానేశ్వర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జ్ఞానేశ్వర్ కు గతంలో యువతులకు ప్రేమపేరుతో వల వేసి మోసం చేసిన కేసులున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి కఠినంగా శిక్షించాలని స్థానికులు అంటున్నారు."

                                      ఈ  విషయంలో జ్ఞానేశ్వర్ తప్పు ఎంత ఉందొ అంతకు రెట్టింపు అతనితో లేచిపోయిన ఆవిడకూ  ఉన్నప్పటికీ కేవలం స్త్రీ పక్షపాతి గా భారతీయ చట్టాలు వలన ఆమె తప్పించుకోగలుగుతుంది. ఒకప్పుడు భర్తలకు భార్యలను శిక్షించే అధికారం ఉండేది కాబట్టి , ఆవిడ విషయం భర్త చూసుకుంటాడులే అని చట్టం బాధ్యత అతనికి వదిలేసి ఉండవచ్చు. కానీ స్త్రీ పురుషులు సమానత్వం గురించి గట్టిగా నొక్కి చెపుతున్న ఈ  కాలం లో లేచిపోయిన వివాహిత విషయం లో శిక్షల పరంగా  స్త్రీ పురుషుల మద్య అసమానత చూపడమంటే  "చలం గారి రాజేశ్వరి"ల ను ప్రోత్సాహించడమే  అవుతుంది.

                                             (19/2/2015 Post Reposted ).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!