సెల్ స్క్రీన్ పగులగొట్టిందని, నాయనమ్మ నెత్తి పగులగొట్టి చంపిన మనవడు ! !
ఆమె పేరు లక్ష్మమ్మ . వయస్సు 90 సంవత్సరాలు పై మాటే. వృద్దాప్యం లో ఉంది కాబట్టి కొడుకు పంచన బ్రతుకుతుంది కాబోలు. ఉండేది బెంగలూరులోని కదరణ హళ్లి ప్రాంతం లో . తన తొంబై యేండ్లు జీవితం లో ఎన్నో పురుళ్ళు పోసి ఉంటుంది. ఎన్నో చావులను చూసి ఉంటుంది. కాని తన చావు తన మనవడి చేతిలో ఉంటుందని , కళ్ళు కనపడక చేసిన ఒక చిన్న తప్పుకు తన మనవడు తనకు మరణ శిక్ష వేస్తాడని పాపం ఊహించి ఉండదు. బోడి సెల్ స్క్రీన్ పగిలిందని 90 యేండ్ల నానమ్మను 22 యేండ్ల మనవడు నెత్తి పగులగొట్టి చంపిన ఉదంతం పోయిన సోమవారం బెంగలూరులో జరిగింది. అదెలా అంటె లక్ష్మమ మనవడు శివరాజ్ తన సెల్ ని లివింగ్ రూం లో చార్జింగ్ కి పెట్టి వెల్లాడట . కళ్ళు సరిగా కనిపించని లక్ష్మమ్మ గారు అటుగా వెలుతుంటే ,పొరపాటున చార్జింగ్ వైర్ కి కాలు తగిలి ఆ అదాటులో సెల్ క్రిందపడి స్క్రీన్ మాత్రమే ముక్కలు అయింది అట. దానితో వెర్రి గంగిరిలు ఎత్తిన శివరాజ్ , కోపంతో ముసలమ్మను ఒక చెక్క పలక పెట్టి గొంతు మీద కొడితే , "అమ...