పబ్లిక్ లో స్త్రీని హింసించినా లేక స్త్రీ చేత హింసించ బడినా "వెదవ " అయ్యేది మాత్రం మగవాడే ! అని నిరూపిస్తున్న ఈ వీడియోను చూడండి . .
మన దేశం లో గృహ హింస కి బలి అవుతుంది ఎక్కువ శాతం స్త్రీలే అని అందరూ అనుకునేదే ! కారణం స్త్రీలను అనాదిగా ఈ మగ జాతి అణచివేయడం వలన వారిలో అబలత్వం ప్రబలి పురుష బలానికి బలి అవుతుందని సంప్రాదాయ బావన . కాని గృహ హింస కు బలి అయ్యే పురుషులు కూడా తక్కువేమి కాదు మన సమాజంలో . అయినా అటువంటి పురుషుల పట్ల సమాజంలో చిన్న చూపు ఉంటుంది తప్పా ,బాదిత స్త్రీల పట్ల కనపరచిన సానుబూతి ని సమాజం పురుషుల పట్ల చూపదు . మగాడి చేతిలో ఆడది తన్నులు తింటే అ మగాడికి బుద్ది చెప్పటానికి అందరూ సంసిద్దు...