రామ! రామ! ఈ దేశం లో భార్యలను మార్చుకునే " పార్టీలు" తగలడ్డాయ్యా!?
వినటానికే సిగ్గు చేటైన విషయం! ఇది అన్య సమాజం ల లోని వారికి అంగీకారం అవ్తుందేమో కాని, భారతీయ సమాజం లో మాత్రం నిస్సందేహంగా అసహ్యపడవలసిన విషయం. అందుకే ఆ "భారతీయ వనిత" ఎదురు తిరిగింది. తిరగడమే కాదు, తన భర్త మీద ఆయనకు వత్తాసు పలికిన నౌకా దళ అధికారుల ని సుప్రీం కోర్టు వరకు ఈడ్చింది. శబాష్, మాతా! శబాష్! ఆమె గారు కొచ్చిన్ లోని సదరన్ నావల్ కమాండ్ కి చెందిన ఒక అధికారి బార్య. మన సైన్యం లోని త్రివిద దళాలలో నౌకా దళం ఒకటి. బ్రిటిష్ వారు అయితే మన దేశాన్ని విడిచి వెళ్ళారు వారి తాలుకు అలవాట్లు, అభిరుచులు మాత్రం మన వారికే ఇచ్చేసి వెళ్ళినట్లుంది. కాబట్టి విదేశి సంస్క్రుతి అయిన "భార్యల మార్పిడి పార్టీలు" నౌకాదళ అధ...