రాహుల్ గాందీ గారు ఒక చెంప పగలగొడితే, కిరణ్ కుమార్ గారు రెండో చెంప పగల గొట్టారు!.
నిన్న కేంద్ర సర్కార్ వారికి రెండు చెంప దెబ్బలు తగిలినట్లైంది! అయితే ఈ చెంప దెబ్బలు కొట్టిన వారు ప్రతిపక్ష పార్టీలో, సుప్రీం కోర్టు వారో కాదు. సాక్షాత్తు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉపాద్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ బావి ప్రదాని అభ్యర్దీ శ్రీ రాహుల్ గాందీ గారు కాగా, రెండవ వారు తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక విదంగా చెప్పాలంటే రాహుల్ గాంది గారి స్టెట్మెంట్ పరిశిలిస్తే కేంద్ర ప్రభుత్వం నైతిక బాద్యత వహించి స్వచ్చందంగా రాజీనామ చేయతగిన తప్పిదం చేసినట్లే లెఖ్ఖ. ఈ దేశ సర్వోన్నత న్యాయస్తానం, నేర గాళ్లు చట్టనిర్మాతలుగా ఉండే దౌర్బాగ్య పరిస్తితి నుండి జాతిని రక్షించడానికి చారితాత్మక తీర్పులను వెలువరించింది. అందులో ఒకటి ఏ ప్రజా ప్రతినిది అయినా సరే కోర్టుల చేత నేరస్తుడిగా నిర్దారించబడిన మరుక్షణం నుండే పదవీచ్యుతులవడమే కాక బవిష్యతులో ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కూడా అనర్హులు. . అలగే క్రిమినల్ కేసుల వలన పోలిస్ కష్టడీ కానీ, జుడిషియల్ రిమాండ్ లో కానీ ఉంటే అట్టి వారు ఎన్