Posts

Showing posts from August, 2015

ఇద్దరు మొగుళ్ళని వదిలేసి , 14 యేండ్లు" మై చాయిస్ మహిళ " గా తిరిగిన ఇంద్రాణి , కన్నకూతురిని పరువు కోసం హత్య చేసిందా?

Image
ఆమె పేరు ఇంద్రాణి ముఖర్జీయ . ముఖర్జీయా అనే ఇంటి పేరు ఆమెకు అధికారికంగా 3 వ  మొగుడైన పీటర్ ముకర్జియా వలన ప్రాప్తించిన ఘనత. సదరు పీటర్ ముఖర్జీయా టీవీ  రంగం లో గొప్ప పేరున్న స్టార్  టీవీ మాజీ సీఈఓ గారు. ఆయనకు ఈవిడ గారు అధికారిక  రెండవ బార్య. పీటర్ గారు జన్మతః ఇంగ్లాండ్ కు చెందిన వారు. ఆయనకు మొదటి బార్య వలన  ఇద్దరు కుమారులు . అందులో రెండవ కొడుకు తల్లితో కలసి డెహ్రాడున్ లో ఉంటున్నాడు అట. అతనికి పిన్ని అయిన ఇంద్రాణి కూతురితో లవ్ ఎఫైర్ ఉంది. ఇద్దరూ పెండ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారని సాక్షాత్తు పీటర్ ముఖర్జీయా గారే, ఇంద్రాణికి  మొదటి మొగుడు వలన కొడుక్కి చెప్పాడు అట. అటువంటి పరిస్తితుల్లో ఇంద్రాణి కూతురు షీనా బోరా 2012 హత్య గావించబడితే , ఈ మద్య ఒక కేసు విచారణ సందర్బం లో ఒక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు, ఇంద్రాణి యే తన కూతురిని చంపి శవాన్ని కాల్పించిదని చెప్పడం తో ఒక్క సారిగా సబ్య సమాజం ఉలిక్కి పడింది. అసలు ఇంద్రాణి వంటి పెద్దింటి మహిళ తన కూతురిని ఎందుకు చంపింది అంటే పరువం లో ఉన్నప్పుడు ఆమె చేసిన పాడు పనులు పాపం లా వెంటాడి ఆమె కూతురిని బలి తీసుకుని ఉంట…

విది రాత వలన " క్వారీలో గ్రానైట్ అయింది కర్ణాటక MLA కి డైనమైట్ "

Image
నేను చిన్నప్పుడు  చదువుకునే రోజుల్లో చందమామ కద లాంటిది  ఒకటి  విన్నాను. అది నిజంగా జరిగిన కదో  లేక కల్పితమో నాకు గుర్తు లేదు. ఆ కదా సారాంశం ఏమిటంటే "విది బలీయమైనది అని దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాద్యం కాదు అని . ఆ కద విన్న తర్వాత  ఎవరికైనా నిజమే అనిపిస్తుంది. టూకీగా దాని గురించి చెపుతాను. 
         ఇద్దరు మిత్రులు ఒక రోజు మిట్ట మద్యాహ్నం వేళ పని మీద మోటర్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు. వారివురు పట్టణ వాసులు. వారు ప్రయాణం చేస్తుంది కూదా పట్టణం లోనే . వారు ఇంటి నుండి బయలు దేరే సమయానికే  ఆ పట్టణానికి సమీపం లో ఉండె చిన్న  ఆడవి లాంటి ప్రదేశం ఉంది. అందులో ఉన్న పుట్టలో ఒక త్రాచు పాము  కూడా బయటకు వచ్చి అడవిలోకి వెళుతూ ఉంది. నిజానికి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వారికి , ఆ పాము ఉన ప్రాంతానికి కొన్ని కిలో మీటర్ల  దూరం ఉంది. బైకే మీద వెళ్ళె వ్యక్తులకి , ఆ పాముకి మద్య ఎటువంటి సంబందం లేదు. ఆ సంఘటణ జరుగక ముందు ఎవరైనా జ్యోతిష్యుడు ఆ పాము కరవడం వలన  ఆ బైక్ నడిపే వ్యక్తీ చని పోతాడు అని చెప్పి ఉంటె అందరూ అతడిని పిచ్చోడిని చూస…

జాకీర్ మొహమద్ , సిటి బస్ లో స్త్రీలకు తన సీట్ ఇచ్చిన తర్వాత చేసే పాడు పని ఏమిటో తెలుసా?

Image
అయన గారి పేరు జాకీర్ మొహమద్ జమాల్ గుజారియ".పేరు పొడుగే కాని బుద్ది బహు పొట్టిది. వయ్యస్సు 46 సంవత్సరాలు . ఈ  కొంచపు బుద్ది ఉన్న పెద్ద మనిషి ఉండెది ముంబాయి లోని అంధేరిలో . పని చేసేది బాంద్రా లో . ఆతను  రోజూ సిటీ బస్సుల్లో తన డ్యూటికీ వెళ్లి వస్తుంటాడు అట.అలాగే మొన్న పనికి వెళుతున్న సమయంలో సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్నాడు అట. ఏవరో మహిళ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను నిలబడ్డాడు . కొఇంత సేపు తర్వాత లేడిస్ సీట్ ఒకటి ఖాళి అయితే అందులో కూర్చున్నాడు . ఒక 22 యేండ్ల కాలేజి స్టూడెంట్ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను పక్కన నిలబడ్డాడు అట. దాని ఆ అమ్మాయి ఒక చిరు నవ్వు నవ్వి , ధాంక్స్ చెప్పింది అట.

    దానితో తండ్రి వయసు ఉన్న జమాల్ గుజారియా లో రిమ్మ తెగులు పుట్టిందట. తానంటే ఆ అమ్మాయికి ఇంటరెస్ట్ ఏర్పందిది అనే అపోహతో చిన్న ఆమెను తాకడం మొదలు పెట్టాడట. ఆ అమ్మాయి పరద్యానంగా ఉండి అతని చేష్టలను పట్టించు కోలెదట . దానితో ఆ అమ్మాయికీ ఇష్టమే అని రూడి చేసుకున్న ఆతను చిన్నగా తన ప్యాంట్ జిప్ ఊడదీసి తన ప్రైవేట్ పార్ట్ ని ఆమెకు తాకించడం మొదలు పెట్టాడు అట. మొదట్లో ఆటను చేస్తున్న దానిని గమని…

మీ అయన నల్లగా ఉన్నాడే అని బాద పడుతున్నారా? అయితే అయన తోలు వలవండి ఇలా!!!?

Image
వర్ణ వివక్షత ! ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఈ వివక్షతకు గురి అవుతున్న వారే. అయితే భారత దేశం లోని వర్ణ వివక్షతకు , ప్రంపంచంలోని ఇతర  దేశాలలో ఉన్న వర్ణ వివక్షతకు బేదం ఉంది. మన దేశం లో వర్ణం అంటే కులం. ఇక్కడ కులవివక్షతకూ భారతీయ సమాజం అనాదిగా గురి అవుతూ ఎంతో నష్ట పోయింది . అగ్రకులాలు , వెనుకబడిన కులాలు , నిమ్నకులాలు అనే వర్గీకరణతో ఒక అంచె పద్దతిలో ఇక్కడి ప్రజలు అందరూ ఏదో రకంగా  కులవ్యవస్తను  బలపరచుకుంటూ  రావడం వలన భారత దేశం లో అది వేళ్ళునుకుని పోయి దృడంగా మారి పోయింది . దానిని నిర్మూలించాటానికి ఆదునిక ప్రభుత్వాలు ఎన్ని పదకాలు ప్రవేశ పెట్టినా , మార్పు క్రమానుగతంగా కొద్ది కొద్ది గా  వస్తుండే తప్పా , ఒక్క సారిగా ఇక్కడి కులవ్యవస్తను  నిర్మూలించే విధం  కనపడడం లేదు. పూర్తి నిర్మూలన కు మరి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు.

       అయితే ప్రపంచం లోని ఇతర దేశాలలో ఉన్న వర్ణ వివక్షత వేరు . అక్కడ ప్రజలలో శరీర రంగు ని బట్టి వివక్షత ఉంది . నల్లగా ఉండే ప్రజలను తెల్లగా ఉండే వారు ఈసదించుకుంటారు. తెలుపు రంగు కలిగిన వారు తామూ ఎంతో గ్రేట్ అని , నలుపు రంగు వారు బానిసత్వానికి…

మచ్చలు లేని అరటి పండు , మానవత్వం లేని శాస్త్రీయ ట్రెండ్ , హానికరమే !!!?

Image
క్రైస్తవుల  పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . వారు కోరిన పలములు , తియ్యనివి తింటూ ఆ వనం లో ఉండేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" తినేలా చేస్తాడు . దానితో వారికి జ్ఞాన నేత్రం లు తెరచుకుని ,తాము దిగంబరంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని , సిగ్గుపడి తమ శరీరాలను ఆకులుతో కప్పుకుంటారు . ఆ తర్వాత దేవుని శాపానికి గురి అయి అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు . అది వేరే కధ.  

   అయితే ఇప్పుడు ఆ కద గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ  రోజు ఈనాడు పేపర్లో చూసిన ఒక విషయం ఆ కదను గుర్తుకు తెచ్చింది. బహూశా ఆదం అవ్వ లు దేవుని మాట వినకుండా జ్ఞాన పలం తిన్న నేరానికి , వారి వారసులైన నేటి మానవులు అ జ్ఞానపరంపర లో కలిగిన శాస్త్రీయ జ్ఞానం వలన పండ్లు ను మ…

నిన్నటికి 4,00,000 దాటిన "మనవు "వీక్షణములు !

Image
సెప్టెంబర్ 6, 2012 న "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే సరిగ్గా  35  నెలలు. ఈ ముప్పై అయిదు నెలల కాలంలో సుమారు 800 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది. అందులో కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం  అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 35 నెలల కాలంలో  మనవు బ్లాగు 4 లక్షల వీక్షణములు సాదించడం ఘన కార్యం కాక పోయినా , సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు  సంతోషం ని  మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన .

    నా బ్లాగు అభివృద్దికి తోడ్పడుతున్న వీక్షకులకు, మిత్రులకు ,శ్రేయోభిలాషులకు ,  విమర్శకులకు , అగ్రిగ్రేటర్ లు యావన్మందికి పేరు పేరు నా దన్యవాదములు తెల్పుకుంటున్నాను. 
                                                                                                         ఇట్లు                                                                                              మద్దిగుంట నరసింహా రావు.                                                 …

నాగార్జున యూనివర్సిటి " మిస్ ఫర్ పెక్ట్ " రిషితేశ్వరి కేసులో నిజమైన "మిస్టర్ మ్రుగాడు " ఎవరు?

Image
మొన్న నాగార్జున యునివర్సిటిలో రాగింగ్ భూతానికి బలి అయిపోయిన అమ్మాయి రిషితేశ్వరి కేసులో కూడా ప్రస్పుటంగా కనిపించేది  బాయ్ ప్రెండ్ ల ఆగడాలు . తోటి విద్యార్దిని మనోబావాలను పట్టించుకోకుండా , ఆ అమ్మాయి నిస్సహాయతను మొహమట్టాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పశువుల్లాగా ప్రవర్తించిన బాయ్ ప్రెండ్ల తీరు గర్హనీయం. అన్నా అని నోరార పిలిచే అమ్మాయిని , ఒంటి  మీద చెయ్ వేసి "అయి లవ్ యు" అనడం. నమ్మి వెంట తిరిగే ఆడపిల్లని వికృత చేష్టలతో సబ్య సమాజo  తల దించుకునేలా ప్రవర్తించడం గురించి వింటుంటె , బాయ్ ప్రెండ్ల సంస్క్రుతి విద్యార్ది లోకానికి ఎంత చేటో అర్దమవుతుంది.


                     రిషితేస్వరి తన డైరీలో రాసుకున్న అనుభవాలు విద్యార్దినులకు వారి తల్లి తండ్రులకు లెసన్స్ లాంటివి . . అందులో కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి . . నిజానికి కేవలం "అయి లవ్ యూ " అన్నందుకో , అసభ్యపు పనులు చేసినందుకో ఆమె ఆత్మ హత్య చేసుకుందని అనలేము. ఆమె అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సీనియర్ మగపిల్లలు ఆమెను విపరీతంగా టార్చర్  చేసి ఉండాలి.  అలాగే ఒక సీనియర్ విద్యార్దిని ఆ అమ్మాయి ని నిం…