విది రాత వలన " క్వారీలో గ్రానైట్ అయింది కర్ణాటక MLA కి డైనమైట్ "

                                                                   
   

                                                                నేను చిన్నప్పుడు  చదువుకునే రోజుల్లో చందమామ కద లాంటిది  ఒకటి  విన్నాను. అది నిజంగా జరిగిన కదో  లేక కల్పితమో నాకు గుర్తు లేదు. ఆ కదా సారాంశం ఏమిటంటే "విది బలీయమైనది అని దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాద్యం కాదు అని . ఆ కద విన్న తర్వాత  ఎవరికైనా నిజమే అనిపిస్తుంది. టూకీగా దాని గురించి చెపుతాను. 

         ఇద్దరు మిత్రులు ఒక రోజు మిట్ట మద్యాహ్నం వేళ పని మీద మోటర్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు. వారివురు పట్టణ వాసులు. వారు ప్రయాణం చేస్తుంది కూదా పట్టణం లోనే . వారు ఇంటి నుండి బయలు దేరే సమయానికే  ఆ పట్టణానికి సమీపం లో ఉండె చిన్న  ఆడవి లాంటి ప్రదేశం ఉంది. అందులో ఉన్న పుట్టలో ఒక త్రాచు పాము  కూడా బయటకు వచ్చి అడవిలోకి వెళుతూ ఉంది. నిజానికి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వారికి , ఆ పాము ఉన ప్రాంతానికి కొన్ని కిలో మీటర్ల  దూరం ఉంది. బైకే మీద వెళ్ళె వ్యక్తులకి , ఆ పాముకి మద్య ఎటువంటి సంబందం లేదు. ఆ సంఘటణ జరుగక ముందు ఎవరైనా జ్యోతిష్యుడు ఆ పాము కరవడం వలన  ఆ బైక్ నడిపే వ్యక్తీ చని పోతాడు అని చెప్పి ఉంటె అందరూ అతడిని పిచ్చోడిని చూసినట్లు చూసి ఉండె వారు. కాని విది ఆడించిన నాటకం లో అది నిజమయ్యే సరికి జనం నిర్గాంత పోయారు  అట. ఇంతకీ ఏమి జరిగింది అంటె,

               అలా పుట్ట నుండి బయటకు వచ్చి తిరుగాడుతున్న  పామును  చూసింది ఒక గద్ద . వెంటనే క్రిందకి దిగి ఒడుపుగా తన కాళ్ళ తో పట్టుకుని ఆకాశం లో వెళ్ళ సాగింది. అదే సమయానికి బైక్ మిత్రులు సిటి బయటకు వస్తుండడం , గ్రద్ద వారిని ఆకాశ మార్గం లో క్రాస్ చేస్తుండగా సరిగా వారు క్రింద ఉన్న సమయానికే పాము పట్టు తప్పి దబ్బున  బైక్ మిత్రులు మీద పడడం , అందులో బైక్ నడిపే వారిని కరఛి , పక్కన ఉన్న తుప్పలోకి వెళ్ళడం జరిగిందట. దానితో బైక్ నడిపే వారు పాముకాటుతో హాస్పిటల్ కి తరలించే లోపే మరణించడం జరిగింది. చూశారా ! బైక్ మీద ప్రయణించే వారు చనిపోవదానికి , ఏక్సిడెంట్ అవ్వడమో హటాతుగ గుండె నొప్పి రావడమో జరిగింటే దానికి కార్య కారణ సంబందం ఉంది అనుకోవచ్చు. ఎక్కడో అడవిలో వెళుతున్న పాము ద్వారా , ఇక్కడ బైక్ నడుపుతున్న వ్యక్తీ చనిపోయాడు అంటె , ఆ కారణ సంబందం ని ఎలా అర్దం చేసుకోవాలి. దానినే "విది  విలాసం" అంటారు ఆని చెపితే నమ్మక తప్పదు. 

      పైన చెప్పిన కద లాంటిది  నాకు మొన్న గుర్తుకు వచ్చింది. దానికి కారణం  అనంతపురం జిల్లాలో రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన రైలు ప్రమాదం. బెంగలూరు -నాందేడ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున కర్ణాటక కాంగ్రెస్  MLA గారితో సహా మరో 4 గురు చనిపోయిన ఆ ప్రమాదం మరియు అది జరిగిన విదానం గురించి  తెలిస్సాక  పై కద గుర్తుకు రావడం లో ఆశ్చర్యం ఏమి లేదు. ML A వెంకటేస్ నాయక గారు వృద్ద కాంగ్రెస్ నేత . అయన వయసు 82 సంవత్సరాలు . 4 సార్లు కర్ణాటక లోని దేవదుర్గ నియోజక వర్గం నుండి ఎన్నికైన చరిత్ర ఆయనది. అయన చల్లటి  A C  బోగీలో హాయిగా ప్రయాణం చేస్తున్నారు. అర్దరాత్రి ట్రైన్ కు ఏక్సిడెంట్ అయింది . అదీ ఎలాగు అయింది అంటె , ట్రైన్ రైల్ క్రాసింగ్ ను దాటే సమయం లో , అయన ప్రయాణించే బోగి సరిగ్గా రోడ్డు  క్రాసింగ్ వద్దకు వచ్చే సరికి , అదుపు తప్పినా గ్రానైట్ లోడు లారి ఒకటి రైల్వే గేట్ లను బద్దలు చేఉకుంటు వచ్చి ,నాయక గారు ఉన్న బోగీని గుద్దితే ఆ దెబ్బతో , లారీ పై ఉన్న గ్రానైట్   రాయి ఒకటి బోగీకి తగలడమే కాక , బోగిని బద్దలు చేసుకుంటు అవతలి వైపుకు దూసుకు పోయింది. దానితో ఆ బోగీలో ఉన్న 5 గురు, ML A  గారి తో సహా అక్కడికక్కడే మరణించడం జరిగింది. 

                                చూసారా ఎక్కడొ క్యారిలో ఉండె  గ్రానై ట్ రాయి  లారీ మీద  రోడ్డు మార్గం లో తరలించబడుతూ , రైలులో హాయిగా  ప్రయాణిస్తున్న వారిని , నిద్రలో ఉన్న వారిని , నిద్రలో ఉన్నట్లే చంపబడటానికి కారణం అయిన విదానం చూస్తుంటే పై పాము కద గుర్తుకు రావడం లేదూ ? దానినే విది  విలాసం  అని కొందరంటే ,డ్రైవర్ నిర్లక్ష్యం , అని ఇంకా ఎదో అని  మిగతా వారు  అంటుంటారు. ఆ సమయం లో బ్రేక్ లు పయిల్ అయ్యాయని లారీని కంట్రోల్ చెయ్యడం డ్రైవర్ కి సాద్యం కాకనే , అతనూ ఆ ప్రమాదం లో మరణించాడని అంటున్నారు. ఇటువంటి సంఘటనలు మీద  బౌతిక పరమైన కారణాలు కనుగొని ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే అధికారుల బాద్యత తీరిపోతుంది. విది విలాసాలు అనేవి ట్రాష్ అనే నమ్మక్కం ఉండబట్టి వాటి గురించి ఆలోచించడం వేస్ట్ అంటారు బౌతిక వాదులు. ఏదైనా ఇది బౌతిక వాదుల యుగం కాబట్టి, విది విలాసం అనే వాటి మీద పరిసోదనలు  ఉండవు కాబట్టి ,  వారి నమ్మకాలకే విలువ మరి  . 

  

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )