ఇద్దరు మొగుళ్ళని వదిలేసి , 14 యేండ్లు" మై చాయిస్ మహిళ " గా తిరిగిన ఇంద్రాణి , కన్నకూతురిని పరువు కోసం హత్య చేసిందా?

                                                                               


                                ఆమె పేరు ఇంద్రాణి ముఖర్జీయ . ముఖర్జీయా అనే ఇంటి పేరు ఆమెకు అధికారికంగా 3 వ  మొగుడైన పీటర్ ముకర్జియా వలన ప్రాప్తించిన ఘనత. సదరు పీటర్ ముఖర్జీయా టీవీ  రంగం లో గొప్ప పేరున్న స్టార్  టీవీ మాజీ సీఈఓ గారు. ఆయనకు ఈవిడ గారు అధికారిక  రెండవ బార్య. పీటర్ గారు జన్మతః ఇంగ్లాండ్ కు చెందిన వారు. ఆయనకు మొదటి బార్య వలన  ఇద్దరు కుమారులు . అందులో రెండవ కొడుకు తల్లితో కలసి డెహ్రాడున్ లో ఉంటున్నాడు అట. అతనికి పిన్ని అయిన ఇంద్రాణి కూతురితో లవ్ ఎఫైర్ ఉంది. ఇద్దరూ పెండ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారని సాక్షాత్తు పీటర్ ముఖర్జీయా గారే, ఇంద్రాణికి  మొదటి మొగుడు వలన కొడుక్కి చెప్పాడు అట. అటువంటి పరిస్తితుల్లో ఇంద్రాణి కూతురు షీనా బోరా 2012 హత్య గావించబడితే , ఈ మద్య ఒక కేసు విచారణ సందర్బం లో ఒక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు, ఇంద్రాణి యే తన కూతురిని చంపి శవాన్ని కాల్పించిదని చెప్పడం తో ఒక్క సారిగా సబ్య సమాజం ఉలిక్కి పడింది. అసలు ఇంద్రాణి వంటి పెద్దింటి మహిళ తన కూతురిని ఎందుకు చంపింది అంటే పరువం లో ఉన్నప్పుడు ఆమె చేసిన పాడు పనులు పాపం లా వెంటాడి ఆమె కూతురిని బలి తీసుకుని ఉంటాయి . అవేమిటో చూద్దాం .

          ఇంద్రాణి తన తల్లి తండ్రులకు ఒక్కతే కూతురు . ఆమెకు పెళ్లీడు వచ్చింది కదాని బోరా ప్యామిలికి చెందిన వ్యక్తి  కి ఇచ్చి వివాహం చేస్తే రెండెళ్ళల్లో ఇద్దరు పిల్లలను కని తల్లితండ్రుల ముఖాన పడేసి, ఒక ఫైన్  మార్నింగ్  ఎవరో ఖన్నా తో లేచిపోయిడట. ఆ దెబ్బతో మొదటి పెండ్లి మటాష్. పోని ఆ పోయిన రెండవవాడితో అయినా కరెక్టుగా కాపురం చేసిందా అంటె అదీ లేదు . రెండేళ్ళ తర్వాత అతనికి చెప్పకుండా ఎక్కడికో మాయం అయిందట. అలా వెళ్లి పోయిన ఆ మహా ఇల్లాలు 14 యేండ్లు తర్వాత స్టార్ T V మొగల్ అని పేరుగాంచిన పీటర్ ముకర్జీయాని పెండ్లాడడం ద్వారా వార్తల్లో ప్రముఖమైంది . అప్పుడు కాని తెలవలేదు ఆమె మొదటి సంతానానికి తమ తల్లి ఎక్కడుందో అన్న సంగతి. అప్పటికి ఆ అక్కా తమ్ముళ్ళు  పదవ తరగతి చదువుతున్నారు అట.

     అప్పటికే ఆమె తో ఆమెకు రెండవ మొగుడి వలన కలిగిన కూతురు తో టచ్ లో ఉంది . తల్లి దగ్గర నుంచి లభించే డబ్బు దానివలన తమ కెరీర్ డెవ లెప్ మెంట్  ని ఆలోచించుకుని , పిల్లలు కూడా పాపం ఆమె దగ్గరికే అంటే ఆమె చేర్పించిన కాలేజి హాస్టల్లో నే  చేరారు. పీటర్ ముకర్జీయా కొడుకు రాహుల్ ముఖర్జీయాకు , ఇంద్రాణి మొదటి కూతురు షినా బోరాకు మద్య రొమాన్స్ నడుస్తుంటే , తల్లి  వద్దని వారించింది అట. దానితో తల్లి కూతుళ్ళు మద్య గొడవ వచ్చి కూతురు తల్లి తో విబేదించి వేరుగా వెళ్లి పోతే , పరువంలో ఉన్నప్పుడు పరువు ప్రతిష్టలు గురించి పట్టించుకోని ఆ మహా తల్లి, తన  కూతురు చేసింది పరువు తక్కువ పనిగా  బావించి, పరువు హత్య చేసిందని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఈ  విషయం కూడా  కూతురిని హత్య చేసిన 3 యేండ్లకు బయట పడింది. అదెలా అంటే ,

 
 శ్యాం రాయ్ అనే వ్యక్తీ అనదికారికంగా ఒక పిస్టల్ కలిగి ఉన్నాడు అన్న ఆరోపణ మీద  పోలిస్ స్టేషని కి తీసుకు వచ్చి నాలుగు పికితే , చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు తో సహా కక్కేసాడు అట. సదరు శ్యామ్ రాయి ఒక్కప్పుడు ఇంద్రాణి కారు డ్రైవర్ . అతడు చెప్పిన  నేరాల చిట్టాలో , ఇంద్రాణి తో కలసి షినా బోరాను చంపిన వ్యవహారం కూదా ఉండడం తో , మొదట తెల్ల బోయిన పోలిసులు తర్వాత తేరుకుని , ఇంద్రాణి తో సహా ఇద్దరి మీద కేసు పెట్టి రిమాండ్ కు పంపించారు. ప్రస్తుతం ఇంద్రాణి కస్టడి కోసం పిటిషన్ వేసినట్లు ఉంది. ఆమె చేసిన ఘోరమైన పనులు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియాల్సి ఉంది. అప్పటి వరకు ఏమి జరుగుతుందో చూదాం.

  విది వంచితులను వివాహమాడిన నష్టం ఏమి ఉండదు కాని, విదం చెడిన ఇంద్రాణి లాంటి మహిళను జీవితం లోకి ఆహ్వానిస్తే , ఎలాంటి అవాంచనీయ పరిస్తుతులు ఎదురవుతాయో ,ఇంద్రాణి జీవిన విదానం ద్వారా తెలుసుకోవచ్చు. చివరకు ఈమె జీవితాన్ని కూదా ఒక సిరియల్ గా తీసి స్టార్ T V  వారే ప్రసారం చేస్తే పిచ్చ రేటింగులు వచ్చే అవకాశం ఉంది.  (సశేషం )

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం