నాగార్జున యూనివర్సిటి " మిస్ ఫర్ పెక్ట్ " రిషితేశ్వరి కేసులో నిజమైన "మిస్టర్ మ్రుగాడు " ఎవరు?
మొన్న నాగార్జున యునివర్సిటిలో రాగింగ్ భూతానికి బలి అయిపోయిన అమ్మాయి రిషితేశ్వరి కేసులో కూడా ప్రస్పుటంగా కనిపించేది బాయ్ ప్రెండ్ ల ఆగడాలు . తోటి విద్యార్దిని మనోబావాలను పట్టించుకోకుండా , ఆ అమ్మాయి నిస్సహాయతను మొహమట్టాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పశువుల్లాగా ప్రవర్తించిన బాయ్ ప్రెండ్ల తీరు గర్హనీయం. అన్నా అని నోరార పిలిచే అమ్మాయిని , ఒంటి మీద చెయ్ వేసి "అయి లవ్ యు" అనడం. నమ్మి వెంట తిరిగే ఆడపిల్లని వికృత చేష్టలతో సబ్య సమాజo తల దించుకునేలా ప్రవర్తించడం గురించి వింటుంటె , బాయ్ ప్రెండ్ల సంస్క్రుతి విద్యార్ది లోకానికి ఎంత చేటో అర్దమవుతుంది.
(4). నయానో బయానో రిషితేస్వరిని కాలేజి లో డి మోరల్ గా చేసి, ఆ తర్వాత ఆ అమ్మాయిని శాశ్వతంగా తమ కామత్రుష్ణకు ఉపయోగించుకుందాం అనే దుర్బుద్దితోనే ఆ ముగ్గురు సీనియర్ లను ముందు పెట్టి తెర వెనుక కదను వేరే వాళ్ళు నడిపారా? అయితే ఆ మిస్టర్ మ్రుగాడు ఎవరు?
(5). రిషితేస్వరి కేసు గురించి కాలేజిలో విద్యార్దులు , ప్రిన్సిపాల్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం గా విడిపోయి కొట్టుకోవలసినంత అవసరం ఏమి వచ్చింది? ఈ విషయం లో ప్రిన్సిపాల్ అమాయకుడు అయితే ఆదరా బాదరా హైదరాబాద్ వెళ్లి పైరవీలు చేసుకోవలసిన అవసరం ఏమిటి?
రిషితేస్వరి తన డైరీలో రాసుకున్న అనుభవాలు విద్యార్దినులకు వారి తల్లి తండ్రులకు లెసన్స్ లాంటివి . . అందులో కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి . . నిజానికి కేవలం "అయి లవ్ యూ " అన్నందుకో , అసభ్యపు పనులు చేసినందుకో ఆమె ఆత్మ హత్య చేసుకుందని అనలేము. ఆమె అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సీనియర్ మగపిల్లలు ఆమెను విపరీతంగా టార్చర్ చేసి ఉండాలి. అలాగే ఒక సీనియర్ విద్యార్దిని ఆ అమ్మాయి ని నిందితుల్లో ఒకడిని ప్రేమించమని వేదించింది అట .రిషితేస్వరిని తమ గుప్పిటలో ఉంచుకోవడానికి , అర్దనగ్నంగా రూములో ఉంచి , సెల్ పోన్బ్లో చిత్రీకరించి , ఆ మగ వేదవాలకు ఇచ్చిందని సమాచారం. ఈ విషయం మీద మనకు సహజంగా కలిగే అనుమానాలు కొన్ని ఉన్నాయి. అవి
(1). ఆ సీనియర్ అమ్మాయి కి, రిషితేస్వరి ని , సీనియర్ ని ప్రేమించమని బలవంత పెట్టడం లో అంత ఇంటరెస్ట్ ఏమిటి ? ఆ సీనియర్ మగ వేదవకి, సీనియర్ అమ్మాయి ఎందుకు ఎజెంట్ లాగా పని చేసింది? ఆ సీనియర్ ఆడపిల్లని ప్రబావపరచే అంట డబ్బు హోదా కలిగిన నేపద్యం నిందితులైన మగ విద్యార్దులకు లేదు అనేది స్పష్టం . కేవలం స్నేహం కోసం అలాంటి పాడు పని నిందితురాలు చేసిం దనుకోవటమ్ నమ్మశక్యం కాదు.
(2). నిందితులైన సీనియర్ మగపిల్లలు ఇరువురి కుటుంభ నేపద్యం చూస్తే , మామూలు పేదింటి పిల్లలు. మరి అలాంటి వారు ఒక ఆడపిల్లని ట్రాప్ చేసి , సెల్ పోన్ ద్వారా , ఇంకో ఆడపిల్ల సహాయం ద్వారా రిషితేస్వరిని వేదించే అంత గుండె దైర్యం ఎలా వచ్చింది? తేడా వస్తే కేసుల్లో ఇరుకుంటామని తెలియని అమాయకులా వారు?
(3). కాలేజి ప్రెష్రర్స్ డే పార్టిలో రిషితేశ్వరి ని " మిస్ పర్పెక్టు " అని ప్రకటించడం , ఆ తర్వాత సీనియర్లు ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కాకతాలీయాగానే జరిగిందా ? లేకుంటే కాలేజి లోని వేరే మృగాల్ల హస్తం ఉందా?
(4). నయానో బయానో రిషితేస్వరిని కాలేజి లో డి మోరల్ గా చేసి, ఆ తర్వాత ఆ అమ్మాయిని శాశ్వతంగా తమ కామత్రుష్ణకు ఉపయోగించుకుందాం అనే దుర్బుద్దితోనే ఆ ముగ్గురు సీనియర్ లను ముందు పెట్టి తెర వెనుక కదను వేరే వాళ్ళు నడిపారా? అయితే ఆ మిస్టర్ మ్రుగాడు ఎవరు?
(5). రిషితేస్వరి కేసు గురించి కాలేజిలో విద్యార్దులు , ప్రిన్సిపాల్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం గా విడిపోయి కొట్టుకోవలసినంత అవసరం ఏమి వచ్చింది? ఈ విషయం లో ప్రిన్సిపాల్ అమాయకుడు అయితే ఆదరా బాదరా హైదరాబాద్ వెళ్లి పైరవీలు చేసుకోవలసిన అవసరం ఏమిటి?
(6). ప్రిన్సిపాల్ బాబురావు గారు , అమ్మాయి ల విషయం లో మంచి హుషారే అని అయన ఆడపిల్లలను పట్టుకుని డ్యాన్స్ లు వేసిన తీరు తెలియ చేస్తుంది. రిషితేశ్వరి మరణం తర్వాత నిందితులు బాబు రావు గారితో కలసి మంతనాలు జరిపారని తోటి విద్యార్దులు అంటున్నారు. . అంటే ఈ కేసులో "మిస్టర్ మ్రుగాడు " కి ప్రిన్సిపాల్ గారికి ఉన్న లింక్ ఏమిటి?
(7). కేవలం తన పేదింటి సీనియర్ ల కోసం ఒక సీనియర్ విద్యార్దిని , తోటి ఆడపిల్ల పట్ల అంత అమానవీయంగా ప్రవర్తించిందని అనుకోవడం కష్టం. అంత కంటె ఏదో బలమైన శక్తి ఆమెను ప్రబావ పరచి ఉండాలి. అదే శక్తి మగ సీనియర్లను ఉసి కొల్పి ఉండాలి . కాబట్టి ఆ 3 నిందితుల్లో ఎవరో ఒకరు అప్రోవెర్ గా మారి ప్రాస్కూషన్ వారికి సహకరిస్తే తప్పా , అసలు విషయాలు వెలుగులోకి రావు.
ఈ కేసు విచారణ కోసం నియమించిన కమిటీ వారు , విద్యార్దులు అందుబాట్లో లేనందు వలన విచారణ సాగించ లేక పోయామని , ఇంకా కొంత సమయం కావాలని అదిగినందువలన ప్రబుత్వం వారు 10 వ తారీకు దాక గడువు పొడింగించారు . కాబట్టి నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్దులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమకు తెలిసింది నిర్బయంగా , అవసరమైతే రాత పూర్వకంగా కమిటీ వారికి ఇవ్వాలి. ఒక వేళ ఈ విషయం లో పోలిస్ వారు తీసుకునే చర్యలు సరిపోవు అని బావిస్తే కోర్టుల్లో ప్రైవేట్ కంప్లైంట్ లు దాఖలు చేయడం ద్వారా ఇతర బాద్యులను కూడా కేసులో చేర్చవచ్చు. వారిని ప్రాసికుట్ చేసి సాక్ష్యాదారాలతో వారు చేసిన నేరాలు నిరూపిస్తే వారికి శిక్ష పడడం ఖాయం.దీనికి విద్యార్దుల్లో ఐక్యత సాదించడం ఎంతో అవసరం . ఆ విదంగా బవిష్యత్ లో ఏ ఆడపిల్ల మీద వేదింపులు జరుగకుండా విద్యార్ది లోకం క్రుషి చేస్తే మంచిది . ఇదే రిషితేశ్వరి లాంటి చెల్లెళ్ళకు మీరిచ్చే నిజమైన నివాళి .
మరింత సమాచారం కొరకు చూడండి
మరింత సమాచారం కొరకు చూడండి
Comments
Post a Comment