కుహానా లౌకిక వాదాన్ని కూల్చివేస్తున్న భారతీయ యువత !
ఈ రోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల పలితాలు సరళీ గమనిస్తుంటే ఒక విషయం సష్టమవుతుంది. అబద్దాలతో అందరిని ఎల్లకాలం మోసం చెయ్యలేరు. అలాగే ఇన్నాళ్లు మత వాద పార్టీ అని ముద్ర వేసి B.J.P ని కుహానా లౌకిక వాద కాంగ్రెస్ పార్టీ ప్రజలను మబ్య పెట్టి తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. కానీ అసలు లౌకిక వాదం అంటే నీ,నా అనే బేద భావం లేకుండా అన్ని వర్గాల ప్రజలను దోపిడి చెయ్యడమే అనే ఒక కొత్త అర్దాన్ని అధికార కాంగ్రెస్ చెప్పింది. ఇన్నాళ్ళు ఈ పార్టీ ఆడింది ఆటగా , పాడింది పాటగా సాగటానికి కారణం కాంగ్రెస్కి సాంప్రాదాయంగా ఉన్న ఓటు బాంక్ . స్వాంతత్ర్యోద్యమం లో ఆ పార్టీ చేసిన కృషి తాలూకు పలితాన్ని నెహ్రూ కుటుంబం ఇన్నాళ్ళు అనుభవిస్తూ వస్తుంది. వృద్ద తరం లో ఆ పార్టీ పట్ల ఉన్నఅభిమానం , నెహ్రూ కుటుంబం పట్ల ఆరాధనా బావం గా గా మారి ఆ కుటుంభ వారసులనే డిల్లీ గద్దె పైన కోర్చొబెడుతో వస్తున్నారు. ...