భారతీయ సంస్కృతిని బజారు కీడ్చిన "వైజాగ్ నిర్భయ " కేసు ?
ఈ దేశం లో సంచలనాలు సృష్టించిన నిర్భయ కేసుల్లో ఒకే ఒక విషయం కామన్ గా ఉంటుంది . అదే "బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ సంస్క్రుతి ". గర్ల్ ప్రెండ్ ను వేంటేసుకు తిరిగే బాయ్ ప్రెండ్ లకేమో తెలుగు సినిమా హీరోలాగా వంద మందిని ఒంటి చేత్తో విరగదీసే బలం ఉండి చావదాయే! పోని బాయ్ ప్రెండ్ లతో ఉండే గర్ల్ ప్రెండ్ లని చూసి ,'వారి మానాన వారినొదిలెదాం . బాయ్ ప్రెండ్ లతో ఒంటరిగా తిరగడం వారి ప్రాదమిక హక్కు ,ఆ హక్కును గౌరవించడం మన బాద్యత ', అనే బుద్ది జ్ఞానం రోడ్ల మీద తిరిగే ఈ 'మగ జంతువు ' లకు లేకుండా పోయే ! "ఈ సమాజంలో కొంత మంది మగాళ్ళ బుద్ది ఇది, కాబట్టి స్త్రీలు కొంచం జాగర్తగా ఉంటె వారికి ఎదురయ్యే ప్రమాదాలు తప్పించుకోవచ్చు" ,అని ఎవరైనా చెపితే , వారు చాందసులు , మను వాదులు, హిందూ సంస్క్రుతి పరిరక్షకులు, స్త్రీ అభివృద్ధి...