భారతీయ సంస్కృతిని బజారు కీడ్చిన "వైజాగ్ నిర్భయ " కేసు ?

                                                                         

   


ఈ దేశం లో సంచలనాలు సృష్టించిన నిర్భయ కేసుల్లో ఒకే ఒక విషయం కామన్ గా ఉంటుంది . అదే "బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ సంస్క్రుతి ". గర్ల్ ప్రెండ్ ను వేంటేసుకు తిరిగే బాయ్ ప్రెండ్ లకేమో తెలుగు సినిమా హీరోలాగా వంద మందిని ఒంటి చేత్తో విరగదీసే బలం ఉండి చావదాయే! పోని బాయ్ ప్రెండ్ లతో ఉండే గర్ల్ ప్రెండ్ లని చూసి ,'వారి మానాన వారినొదిలెదాం . బాయ్ ప్రెండ్ లతో ఒంటరిగా తిరగడం వారి ప్రాదమిక హక్కు ,ఆ హక్కును గౌరవించడం మన బాద్యత ', అనే బుద్ది జ్ఞానం రోడ్ల మీద తిరిగే ఈ 'మగ జంతువు ' లకు లేకుండా పోయే ! "ఈ సమాజంలో కొంత మంది మగాళ్ళ బుద్ది ఇది, కాబట్టి స్త్రీలు కొంచం జాగర్తగా ఉంటె వారికి ఎదురయ్యే ప్రమాదాలు తప్పించుకోవచ్చు" ,అని ఎవరైనా చెపితే , వారు చాందసులు , మను వాదులు, హిందూ సంస్క్రుతి పరిరక్షకులు, స్త్రీ అభివృద్ధి  నిరోదకులు , ఇలా అనేక టాగ్స్ వారికి తగిలించేసి , విదేశి సంస్క్రుతి పరిరక్షణ కోసం కంఖణమ్ కట్టుకున్న వారు నిందలేసి అనందిస్తుంటారు .

  ఏ స్త్రీ నైనా ,చివరకు వేశ్యనైనా సరే ఆమె అనుమతి లేకుండా ఆమెను టచ్ చేయరాదు .ఇది భారత రాజ్యాంగం తన పౌరులకు ఇచ్చిన వ్యక్తీ స్వేచ్చా హక్కుల్లో బాగం .దానిని అమలు పరచాల్సిన బాద్యత ప్రభుత్వ యంత్రాగం మీద ఉంది . అందుకే బాదితులు ఎటువంటి వారైనా ,వారి మీద లైంగిక వేదింపులు జరిపితే, నిందితులు  "నిర్భయ "క్రింద బుక్ కావలసిందే !ఈ ప్రాదమిక సూత్రాన్ని కొంతమంది మగాళ్ళు మరచి పోయి" మ్రుగాళ్ళు " గా మారి పోతున్నారు  .వారి వాదన ఏమిటంటె , రాత్రుళ్ళు ఒంటరిగా బాయ్ ప్రెండ్ లతో తిరిగే గర్ల్ ప్రెండ్ లను చూస్తే తమలోని మృగత్వం ఒళ్ళు విరుచుకుంటుదని , ఆ టైమ్ లో దానిని కంట్రోల్ చేయటానికి తమ దగ్గర తాళ్ళు ,మోకులు ఏమి ఉండవని ,అందుకే తాము అలా స్త్రీల పట్ల ప్రవర్తించవలసి వస్తుందని చెపుతున్నారు . ఈ మాట ను చట్టం ఒప్పుకోదు కాబట్టి , జరగవలసిన నష్టం జరిగాక వారిలోని మృగత్వం తో సహా వారిని కఠ కఠాల్లో బందించి శిక్షించడం జరుగుతుంది . శిక్షించడం వరకే ప్రభుత్వ బాద్యత . సమాజంలోని మిగతా మగాళ్ళకు  కౌన్సిలింగ్ ఇచ్చే అధికారం వారికి లేదు .ఎందుకంటే అలా ఇవ్వవలసి వస్తే , స్త్రీలకు కూడా జాగార్తలతో కూడిన  సుద్దులు చెప్పవలసి ఉంటుంది . అలా చెప్పిన మరుక్షణం ఆందోళనలు రేడి . అందుకె ఆ తల నొప్పి వారికెందుకు?

 నేను పైన చెప్పినట్లు ,సంచాలనాత్మకమైన ప్రతి నిర్భయ కేసులోనూ అంతో ఇంతో బాయ్ ప్రెండ్ గర్ల్ ప్రెండ్ కల్చర్ ఉంతుందనే  విషయం  మొన్న వైజాగ్ కేసులోనూ రుజువు అవుతుంది . ఈనాడులొ వచ్చిన ఈ క్రింది సమాచారం చూస్తే అందులో ఎన్ని మిస్సింగ్ పాక్ట్ లూన్నాయో కామన్ సెన్స్ ఉన్నవారి కెవరికైనా అర్ధం అవుతుంది . 

                                                                       


       అమ్మాయి ది విజయవాడ .వచ్చింది హైదరాబాద్ నుంచి .స్నేహితుడి సోదరి పెండ్లి అయ్యాక ,ఆమెను వైజాగ్ అంతా తిప్పి చూపిస్తాను అని చెప్పిన బాయ్ ప్రెండ్ ,తన ఇంట్లోని స్త్రీలకు ఆమె బస బాద్యతలు అప్ప చెప్పకుండా ,తన ఇంకో మగ స్నేహితుడికి అప్ప చెప్పాడు . అతనేమో ఆమెను తన ఇంట్లో కాకుండా వేరే భవనంలో ఉంచి పార్టి చేసుకోవడం మొదలెట్టాడు . అర్దరాత్రి పార్టి మీద పోలిస్ రైడ్ జరిగితే అందరితో పాటు ఆ గర్ల్ ప్రెండ్ కూడా పారి పోయింది . అలా పారి పోయిన ఆమె ముగ్గురు మ్రుగాళ్ళకు చిక్కితే అందులో ఒకడు మాత్రమె ఈమెను రేప్ చేసి ,కారులో తెల్లార్లు ఊరంతా తిప్పారు .ఈ విదంగా ఊరంతా తిప్పి చూపిస్తాను అని చెప్పిన అ అమ్మాయి బాయ్ ప్రెండ్ వాగ్దాన్నాని  వీరు నెరవేర్చారు కాబోలు. చివరకు ఆమెను రైల్వే స్టేషన్లో వదిలితే ,ఆ విషయం ఆమె తన అసలు స్నేహితుడికి కాక ,కొసరు స్నేహితుడికి చెపితే,ఆతను ప్లాన్ ప్రకారం ఆ మ్మాయితో పోన్ చేయించడం , తిరిగి మ్రుగాల్ళు ఆమె పోన్ కాల్ కి చలించి పోయి ఆమెకు బస్ టికెట్ లకి పైసలు ఇస్తామని రావడం ,అక్కడ బాయ్ ప్రెండ్స్ కి వారికి మద్య బిగ్  ఫైట్ జరగడం . అది చూసిన స్తానికులు పోలీసులకు కబురు చేయడం , చివరకు మృగాల్ల మీద "నిర్భయ "కేసు బుక్ కావడం అన్ని సినిమా కధను తల దన్నేట్లు ఉన్నాయి . 

   ఇందులొ ఎవరి పాత్ర ఏమిటి అనేది స్పష్టంగా తెలుస్తున్నా ఎవరిని ఏమనలేని నిస్సహాయ పరిస్తితి లో ఉంది ప్రస్తుత సమాజం లోని పెద్దమనిషి తనమ్. సొసైటీలో ప్రబలి పోతున్న "లత్కోరి సంస్క్రుతి "కి  భారతీయ సంస్క్రుతి తల వంచి బేల చూపులు చూస్తుంది . భారతీయ సంస్కృతిని బజారు కీడుస్తున్న ఇలాంటి వైజాగ్ తరహ కేసుల్లో నిజాలు గురించి నిర్భయంగా,అన్ని కోణాల్లో  చర్చించగల దమ్మున్న సమాజం గా మనం మారనంత వరకు,మనం చేయగలిగింది ఏమి లేదు అనిపిస్తుంది .  ఈ దేశం పరువు ప్రతిష్టలు ను  కావాలని కొంత మంది   విదేశియుల ద్రుష్టిలో పలచన చేస్తుంటే ,  ఎవరికీ ఏమి చెప్పలేని, ఏమి చేయలేని  నిస్సహా య స్తితిలో మనం ఇలా ఉండి పోవలసిందేనా ? !. ఆలోచించండి . 


Comments



  1. అదిగో ! మరియొక తరుణీ!
    బతుకు పథమునన్ జిలేబి బట్ట బయలు గా
    చితికెను ! సమాజ మందు వ
    నితలకు పారా హుషారు నిర్భయ మనఘా !

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!