Posts

Showing posts with the label సీమాంద్రా ఉద్యోగుల సమ్మె

సీమాంద్రా ఉద్యోగుల "అత్మాభిమానం"కాపాడిన "పైలిన్" తుఫాన్

                                                                                                                                       మొత్తానికి నేను ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు సీమాంద్రా ఉద్యోగులు సమ్మె విరమించారు. కొన్ని శాఖల వారు తాత్కాలికం అంటున్నా, యన్.జి.వో లు సమ్మె కొన సాగిస్తూనే విదులు నిర్వహిస్తామంటున్నా మొత్తానికి అరవై రోజుల సమ్మెకు ఎలా తెర దించాలో తెలియక అల్లాడుతున్న ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని కాపాడింది ఆగ మేఘాల మీద ముంచుకొస్తున్న పైలిన్ తుఫాన్ అని చెప్పవచ్చు.   రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచుతామని శ్పష్టమైన హామి వచ్చే వరకు సమ్మెను విరమించమని భీష్మ ప్రతిజ్ణ చేసిన సీమాంద్రా ఉద్యోగుల గోడు పట్టించుకోవడానికి కేంద్రం ఏ మాత్రం సుముఖత చూపలేదు, సరి కదా రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలు మరింత వేగవంతం చేసింది. తమ సమ్మె వలనే  టి. నోట్ ఆమోదం రెండు నెలలు ఆలస్యం అయింది అని ఉద్యోగ సంఘాలు అంటున్నా మొత్తానికి కేంద్రం అయితే తెలంగాణా అనేది అనివార్యం అన్నాకా సీమాంద్రా ఉద్యోగుల ఆశలు అన్నీ ఆవిరి అయిపోయినట్లే లెఖ్ఖ.దానికి తోడు గ్రూప్ ఆప్ మినిశ్తర్స్ ని కూడ కేంద్రం నియమించాకా వారు చేయగలిగింది