సీమాంద్రా ఉద్యోగుల "అత్మాభిమానం"కాపాడిన "పైలిన్" తుఫాన్
మొత్తానికి నేను ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు సీమాంద్రా ఉద్యోగులు సమ్మె విరమించారు. కొన్ని శాఖల వారు తాత్కాలికం అంటున్నా, యన్.జి.వో లు సమ్మె కొన సాగిస్తూనే విదులు నిర్వహిస్తామంటున్నా మొత్తానికి అరవై రోజుల సమ్మెకు ఎలా తెర దించాలో తెలియక అల్లాడుతున్న ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని కాపాడింది ఆగ మేఘాల మీద ముంచుకొస్తున్న పైలిన్ తుఫాన్ అని చెప్పవచ్చు.
రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచుతామని శ్పష్టమైన హామి వచ్చే వరకు సమ్మెను విరమించమని భీష్మ ప్రతిజ్ణ చేసిన సీమాంద్రా ఉద్యోగుల గోడు పట్టించుకోవడానికి కేంద్రం ఏ మాత్రం సుముఖత చూపలేదు, సరి కదా రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలు మరింత వేగవంతం చేసింది. తమ సమ్మె వలనే టి. నోట్ ఆమోదం రెండు నెలలు ఆలస్యం అయింది అని ఉద్యోగ సంఘాలు అంటున్నా మొత్తానికి కేంద్రం అయితే తెలంగాణా అనేది అనివార్యం అన్నాకా సీమాంద్రా ఉద్యోగుల ఆశలు అన్నీ ఆవిరి అయిపోయినట్లే లెఖ్ఖ.దానికి తోడు గ్రూప్ ఆప్ మినిశ్తర్స్ ని కూడ కేంద్రం నియమించాకా వారు చేయగలిగింది ఏముంటుంది, తమ ఉద్యోగ హక్కులు గురించి చెప్పుకోవడం తప్పా!
కానీ సీమాంద్రా ఉద్యోగులు కూడా మనుషులే కాబట్టి వారికీ ఆత్మాభిమానం ఉంటుంది. సమ్మె చేసే ఉద్దేశ్యం నెరవేరకుండా సమ్మెను విరమించడం అంటే ఖచ్చితంగా అది చిన్నతనమే అవుతుంది. "అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని" ఒక ప్రక్క తెలంగాణా రాజకీయ నాయకులు, ఉద్యోగులు "మీదీ కూడా ఒక పోరాటమా" అని హేళన చేస్తున్న తరుణంలో కేంద్రం చేత స్పష్టమైన హామీ పొందకుండా సమ్మె ను విరమించడం అంటే చాలా ఇబ్బందికరం. ముఖ్యమంత్రి గారు చెప్పే సమైఖ్యవాదాన్ని కేంద్ర ప్రభుత్వం గడ్డి పోచ కింద జమకట్టి,తెలంగాణా రాష్త్ర ఏర్పాటే తమ అంతిమ లక్ష్యం అంటున్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు ఏమని హామీ ఇవ్వగలుగుతారు? మహ అయితే తన చేతిలో ఉన్నదీ అస్సెంబ్లీలో సంబందిత బిల్ పై అభిప్రాయాలు చెప్పడం తప్పా. కాబట్టి ఉద్యోగుల పరిస్తితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది.
పాపం వారి మొరలు ఇన్నాల్లు చాకిరి చేయించుకుంటున్న కేంద్రం లోని పెద్దలు వినక పోయిన వారు పూజించే దేవుడు విన్నాడు. అందుకే ఒక కారణం వారికి తుఫాన్ రూపంలో పంపుతున్నాడు. అతి భయంకరంగా ఆంద్రా, ఓడిశా రాష్ట్రాలను ముంచెత్తబోతుంది అని చెప్పబడుతున్న "పైలిన్" తుపాన్ పుణ్యమాని సిమాంద్రా ఉద్యోగులు తాత్కాలికంగా (అదే శాశ్వతం కావచ్చు) సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించి విదుల్లో చేరడం వారిలోని మానవత్వానికి ప్రతీక అనుకోవచ్చు. ఇకనైనా సాద్యా సాద్యాలు బేరిజు వేసుకుని తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటే బాగుంటుంది. అయితే వారి సమ్మె ను కేంద్రం నిర్లక్ష్యం చేసినా జాతీయ స్తాయి రాజకీయ నాయకులను ఆలోచింప చేయడం లో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. దాని పలితం ఏమన్నా గ్రూప్ ఆప్ మినిస్తర్లు చేయబోయే సిపార్సుల మీద ఉంటుందేమో చూడాలి.
Comments
Post a Comment