చీపురు కట్ట చేతిలో ఉంది కదా అని అనుమతి లేకుండా ఇల్లు ఊడుద్దామనుకుంటే , చివరకు ఉద్యోగమే ఊడి పోయేటట్టుంది !
నేను ఇంతకు ముందు టపాలో " పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా !?" అనే దానిలో " ఇంకొక ప్రక్క ఆం ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నB.J.P పార్టీ ప్రధాన ప్రతి పక్షం గ ఉన్నంత కాలం, ఆం ఆద్మీ వారి పాలన తుమితే ఊడి పోయే ముక్కు లాంటిదే . అసలు ఆం ఆద్మీ పార్టీ అధినాయకుడు కి పాలనా పగ్గాలు చేపట్టడానికి ఎవరి సహాయం తీసుకోవాలి అన్న విషయం లో సరి అయిన నిర్ణయం తీసుకోలెదు అని పిస్తుంది. తమ పార్టీ ప్రాదాన అజెండ అవినీతి నిర్మూలన అయినప్పుడు , పోయి పోయి, దేశం లోని అవినీతికి మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ వారి సహాయం తీసుకోవడం ఏమిటి? విడ్డూరం కాకపోతే!తమకు కాంగ్రెస్ మరియు B.J.P పార్టీలు రెండు శత్రువులే అని ప్రకటించిన పెద్ద మనిషికి, అవినీతి విషయం లో ఎవరు ప్రదాన శత్రువు, ఎవరు ద్వితీయ శత్రువు అని ఆలోచించే ఇంగిత జ్నానం లేక పొయింది . కమ్మ్యునిస్ట్ సిద్దాంతం ప్రకారం బడా బూర్జువాలను ఎదుర్కోవాలంటే , అంత కంటే తక్కువ బూర్జువాలతో కలసి పని చేయాలి. ఈ సూత్రమే కేజ్రీ వాల్ గారి