ఎన్నో వేల పెటిషన్ లు పరిష్కరించిన ఆ హై కోర్టు జడ్జ్ గారికి తన స్వంత కూతురు విషయంలో పిటిషన్ వేసుకోలేని నిర్బాగ్యుడయ్యడు !. ఎందుకని ?
మనది భారత దేశం. ఇక్కడ అనేక మతాలకు చెందిన వారు కలసి మెలసి జీవిస్తున్నారు. ప్రపంచ దేశాలలో భారతీయ కుటుంభ వ్యవస్తకు ఒక విశిష్ట స్తానం ఉంది. ఎన్నో వేల సంవత్సరాలుగా పటిష్టమైన కుటుంబ జీవన విదానం తో బారతీయ సమాజం అలరారుతూ ఉంది. స్వాతంత్ర్యం వచ్చాకా , భారత రాజ్యాంగం సైతం పౌరులకు మత స్వేచ్చను ప్రసాదించింది . మత పరమైన హక్కుల విషయం లో ప్రభుత్వాలు జ్యోక్యం చేసుకుంటే కోర్టులు తగిన ఆర్డర్లు ద్వారా వాటిని నిరోదించి , మత హక్కులను రక్షిస్తాయి అంటే కారణం మత స్వేచ్చ మన ప్రాదమిక హక్కులో బాగంగా ఉండడమే. కానీ ఇదే మత స్వేచ్చను కొన్ని చట్టాలు ఉల్లంఘిస్తుంటే వాటిని ప్రశ్నించే స్తితిలో హిందువులు లేక పోవడం ఖచ్చితంగా మన దౌర్బాగ్యమే ...