దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !
హిందువులు అయిన పురుషులు వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మాటలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,నాతి చరామి అని .దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేపట్టబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన హిందువు. అప్పుడే హిందూ వివాహా వ్యవస్తకి ఒక అర్దం ,పరమార్దం . అలా చేసి చూపాడు ఒక సామాన్యుడు. అనంత పురం జిల్లాలో కదిరి పరిసర ప్రాంత...