10 సార్లు "విజ్ణాన మృగాలు "ఆమె మీద జరిపిన దాష్టికంలొ ,ప్రతి సారి ఆమెకు 20 పక్కటెముకలు విరిగినంత బాదట !
ఆమె ఒక గిరిజన మహిళ . జార్ఖండ్ రాష్ట్రం లోని ,గుమ్లా జిల్లాలో పత్రు అనే గ్రామానికి చేందిన ఈమే జీవిత గాధ కడు దయనియమైనది . మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయే దురదృష్ట కర సంఘటనలు ఈమె జీవితంలో జరిగాయి . మనిషికి అబ్బిన శాస్త్రీయ విజ్ఞానం ఈమెను పిల్లల్ని కని ఇచ్చె యంత్రంగా మార్చి పారేసింది . 6 గురు పిల్లల్ని కన్నా ఈమె తల్లి కాలేక పోయింది అంటే అది విజ్ణాన మృగాల మహిమే . విషయం లోకి వెళితే : పైన తెల్పిన గిరిజన మహిళ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు .ఆమె తన 13 యేటనుంచే పిల్లల్ని కనడం ప్రారంభించింది .కాని అది సాంప్రదాయ పద్దతిలో పెండ్లి చేసుకుని , తమ కుటుంభం అబివృద్ది కోసం పిల్లలు ను కనే పద్దతి కాదు .పెండ్లి కాకుండానే ,ఇంటి నుంచి డిల్లి నగరానికి తరలించబడి , అక్కడఅరోగ్య రీత్యా పిల్లల్ని కనలేని...