మచ్చలు లేని అరటి పండు , మానవత్వం లేని శాస్త్రీయ ట్రెండ్ , హానికరమే !!!?
క్రైస్తవుల పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . వారు కోరిన పలములు , తియ్యనివి తింటూ ఆ వనం లో ఉండేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" తినేలా చేస్తాడు . దానితో వారికి జ్ఞాన నేత్రం లు తెరచుకుని ,తాము దిగంబరంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని , సిగ్గుపడి తమ శరీరాలను ఆకులుతో కప్పుకుంటారు . ఆ తర్వాత దేవుని శాపానికి గురి అయి అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు . అది వేరే కధ. అయితే ఇప్పుడు ఆ కద గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు ఈనాడు పేపర్లో చూసిన ఒక విషయం ఆ కదను గుర్తుకు తెచ్చింది. బహూశా ఆదం అవ్వ లు