అవమానకర దర్యాప్తుతో ఇల్లాలి ని అనుమానించి, మాజీ న్యాయ మూర్త్రి చేతనే కంట తడి పెట్టించిన "పటమట పోలీసులు "
తెలుగు జాతి సిగ్గుతో తల వంచుకోవాలి, ఇటువంటి పొలిసు అధికారులను నియమించుకున్నందుకు! స్కాట్లాండ్ లాండ్ యార్డ్ పోలిస్ మాదిరి గొప్ప సాహస పరిశోదనలు చేసి ప్రజలకు న్యాయం చేయమని ఎవరూ అడగటం లేదు కాని , కనీసం పిర్యాదు చేసే వారి మనోబావాలు గుర్తించి , వారికి స్వాంతన కలిగేలా మాట్లాడుతూ , విచారణ చేసే బదులు , వారిని మానసికంగా హింసిoచేలా మాట్లాడుతూ , అదేదో తమ డ్యూటిలో బాగం అని పిలయ్యే పోలిస్ అధికారులను చూస్తుంటే అసలు పిర్యాదు ఎందుకు చేసామా అని అనిపిస్తుంది . ఇండియన్ పోలిస్ వారికీ కొన్ని జనరల్ ప్రిన్సిపుల్స్ ఉన్నాయట . ఎ దర్యాప్తులోనైన వాటిని పాటించటం ఇండియన్ పోలీసులో భాగమైన తెలుగు నాట పొలిసు వారికీ సహజo అని విజయవాడ కు చెందిన "పటమట లంక" పోలిస్ వారు సెలవిచ్చారట . పాపం ! విరి దర్యాప్తు తీరుకు సాక్షాత్ ఒక మాజీ న్యాయమూర్తి గారే కళ...