మనo నడవ వలసింది "గ్రామ స్వరాజ్యం" వైపు కాదు, నగర రాజ్య స్తాపన వైపు !
మంచో ,చెడో మన రాష్ట్ర విబజన ప్రక్రియ మొదలయింది . దానిని ఉద్యమాల ద్వారానో , కోర్టు ప్రక్రియల ద్వారానో , మరే రాజకీయ ప్రక్రియల ద్వారానో నిలువరించే చర్యలను మాని , మన తెలుగు జాతి అబ్యున్నతికి ఏమీ చేస్తే బాగుంటుందో ఆలోచిస్తే మంచిదనుకుంటా. మనం రెండు రాష్ట్రాల ప్రజలుగా విడగొట్ట బడినంత మాత్రాన మన మద్య ఉన్న కుల, మత , బాషా , సంబందాలు మనల్ని విడి పోనియవు . తెలంగాణా ,అంద్రా అనే బావం ఆప్ట్రాల్ నిన్న మొన్నటిది . కాని మన సామాజిక సంబందం వేల సంవత్సరాల నుండి మన మద్య పెన వేసుకుని అది మన అణువు అణువు లో నిక్షిప్తం అయి పోయింది . ఆ అణువుల స్పందనే నేడు ఆంద్రా వారు చేస్తున్న ఉద్యమ ప్రక్రియలు. మరి నిన్నటి వరకు తెలంగాణా వారు చేసిన ఉద్యమం దేనికి సంకేతం అని అడగవచ్చు . అది కూడా అన్నదమ్ములు , అక్క చెల్లెళ్ళ మద్య సహజ బావోద్వేగాల చర్యలుగానే గుర్తించాలి .ఒక ఇంటిలో పెద్ద కొడుకు అన్నింటిలో పెత్తనం చెలాయిస్తూ ,చిన్న వారిని నిర్లక్ష్యం చేస్తే గొడవలు కావడం ఖాయం . అదే సమర్దుడైన తండ్రి లేక త