తలంబ్రాలు పోసి అగ్ని సాక్షిగా పెండ్లాడమంటే, కిరోసిన్ పోసి అగ్గి అంటించి హాస్పిటల్లో చేర్చిన ప్రియుడు!.
ప్రేమ కంటే మత్తు అయినది ఏది ఈ ప్రపంచం లో లేక పోవచ్చు. ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నంత కాలం ,అది కలుగ చేసే మత్తులో నుండి భయటకు రావడం కష్టం. అందుకే ప్రేమలోకి దిగకముందే , తను ప్రేమించేవారి గుణగణాలు , ఆ తర్వాతి పరిణామాలు అన్నీ ఆలోచించుకుని,వారితో ప్రేమాయాణం సాగిస్తే కొంతలో కొంత సేఫ్. ప్రేమకు ఇద్దరి పరస్పర అంగీకారం చాలు. కానీ పెండ్లికి కి మాత్రం రెండు కుటుంబాల అంగీకారం కావాల్సి ఉంటుంది. పెద్దల అనుమతి లేకుండా పెండ్లిళ్ళు చేసుకునే వారికి ఈ నియమం వర్తించక పోవచ్చు, కానీ ప్రేమించక ముందే తన ప్రియుడు లేక ప్రియురాలు అలా చేయగల సాహసం గల వారేనా అని ఆలోచించాకే తర్వాతి అడుగు వేయ్యాలి. అసలు ప్రేమించే వారు ఎవరైనా ఇవ్వన్నీ ఆలోచించి చేస్తారా , ఇవ్వన్నీ ప్రేమ గురించి తెలియని వారు చెప్పే పిచ్చి మాటలు అని అనుకుంటే , ఇదిగో ఈ ఉదంతం లో మాదిరి తలంబ్రాలు కు బదులు కిరోసిన్ , పల్లకి కి బదులు పాడె ఎక్కాల్సి ఉంటుంది. అమ్మాయి B. Tech పైనలియర్ చ...