మహిళ తనను రేప్ చేయనీయ లేదని కేసు పెట్టడానికి పోయాడంట, మృగతనం తెగిన మగాడు!!?
అది మద్యప్రదేశ్ రాష్ట్రం లోని ఉమేరియా జిల్లాలోని మణ్ పూర్ పోలిస్ స్టేషన్ . మొన్న 29 వ తారీఖు తెల్లవారు జామున రామ్ కరణ్ ప్రజాపతి అనే వ్యక్తీ పరుగు పరుగున బాదతో విల విల లాడుతూ వచ్చాడు అంట. రావడం తోటే "ఆమె నా మర్మాంగం కోసేసింది మహాప్రభో " అని మొర పెట్టుకున్నాడు అంట. ఎవరు? ఏమిటి కదా ? అని ఆరా తీసిన పోలిసులు అతను చెప్పిన దానిని ప్రాధమిక సమాచారంగా జారీ చేసి , మర్మాంగం వద్ద తీవ్ర గాయాలు అయిన అతనిని హాస్పిటల్లో జాయిన్ చేసి , అతడు చెప్పిన మహిళా , మరియు ఆమెకు సహకరించాడు అని చెప్పబడుతున్న ఆ మహిళ భర్తను అరెస్ట్ చేద్దామని , ఆమె ఊరు అయిన గోవర్డే గ్రామానికి వెళ్ళారు అంట. అక్కడ విచారణ జరిపిన మీదట , అసల...