ఈ "బక్క భీముడు " కి పుల్ మీల్స్ పెట్టాలంటే ,హోటలోళ్లకి వంట్లో వణుకేనంటా ! !
కొంత మంది చూడటానికి చాలా లావుగా ఉండి ,వారి వంటి బరువును మోయడానికే తెగ అప సోపాలు పడుతున్నట్లు ఉంటారు .వారిని చూసినప్పుడు విరు రోజుకు ఎన్ని కిలోల తిండి తింటారో అనిపిస్తుంది .కాని బోజనానికి కూర్చుంటే,మారు అన్నం అడక్కుండా పెట్తిందానితొనె భోజనం కానిచ్చేస్తే ,చాలా ఆశ్చర్యం వేస్తుంది . అలాగే కొంతమంది చూడటానికి సన్నగా ఉన్నా ,తిండి కాడికి వచ్చేసరికి బీముళ్ళె . ఎంత తిన్నా తరగని వారి ఆకలి చూస్తుంటె ,వీరి కడుపులో ఎవడైనా బకాసురుడు లాంటి వాడు ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది . నాకు తెలిసి నా చిన్నప్పుడు మా ఊరిలో "ధర్మా " అనే వ్యక్తీ మా దగ్గర పాలేరు గా పని చెసే వాడు . ఆతను చూడటానికి చాలా బలిష్టంగా ఉండేవాడు. కల్లు తాగినా ,మంచి నీళ్ళు తాగినా ఎత్తిన కుండ ఖాళి చెయ్యకుండా దించే వాడు కాదు .తిండి అయినా నలుగురి పెట్టు తినేవాడు . అలాంటి ధర్మా ఒకసారి మా ఊరికి 10 కిలోమీటర్ల...