ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువా! చెల్లని బిల్లుకు వాదన లేక్కువ!
తెలుగు వారి అసెంబ్లీ సాక్షిగా ఒక గ్రేట్ డ్రామా నడుస్తుంది . భారతీయ అత్యున్నత రాజ్యంగ సంస్తలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముక్యమంత్రే ఆరోపిస్తున్న పరిస్తితులు తొలిసారిగా భారత శాసన నిర్మాణ చరిత్రలో చోటుచేసుకుంది . అటువంటి పరిస్తితిని కూడా ప్రజలు అందోళన లకు బదులు ఇక ముందు ఎం జరుగుతుంది ?అని ఆసక్తిగా గమనిస్తున్నారు అంటే ,తెలుగు ప్రజలు కూడా రాజకీయ పార్టీల వారిగా విడిపోయి తమ తమ పార్టిలను వెనకేసుకు రావడం వలననే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది .అసలు అసెంబ్లీలో జరుగుతున్న తంతు చూస్తుంటే విలువలు తో కూడుకున్న రాజకీయాలు కోరుకునే వారికి ఎవరికైనా అసహ్యం కలుగక మానదు . ఒక జాతీయ స్తాయి పార్టి అందులో అధికారం లో ఉన్న పార్టి వారు , రాష్ట్ర పునర్విభజన బిల్లు అనే అతి ముక్యమైన బిల్లును తొలుత ఒరిజినల్ బిల్ గా వ్యవహరిస్తూ ఆంద్ర ప్...