అల్లాఉద్దీన్ అద్భుత దీపం కంటే పవర్ఫుల్ , నరేంద్ర మోడీ గారి "పె నో ర " మంత్రం !.
మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలులో "అల్లాఉద్దీన్ అద్భుత దీపం " ఒకటి . కడు పేద వాడైన అల్లాఉద్దీన్ అనే యువకుడు తనకు దొరికిన ఒక అద్భుత దీపం లోని భూతం సహాయంతో గొప్ప ధనవంతుడిగా మారడమే కాక , ఆ దేశ యువరాణిని కూడా పెండ్లిచేసుకునే స్థాయికి ఎదుగుతాడు . అయితే ఆ అద్భుత దీపం వలన కేవలం అల్లాఉద్దీన్ మాత్రమే ధనవంతుడు కాగలిగాడు . కానీ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న 8 వ తారీకు రాత్రి పూట పఠించిన మంత్రం మాత్రం దేశం లోని అనేక మంది పేదవారిని అమాంతం తెల్లారే సరికి లక్షాధికారులని చేసింది . అదెలా జరిగింది అంటే : 8 వ తారీకు రాత్రి మోడీ గారు మీడియా ద్వారా అర్ధరాత్రి 12 గంటలు నుండి ఇండియన్ కరెన్సీ నోట్లలో పెద్దవి అయినా 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్ర...