కోట్ల మంది ప్రజల కోరికను కాదని , అసద్దుద్దిన్ గారి కోరికను తీర్చు తుందా పిరోజ్ గాందీ గారి కోడలు!?
ఎంకి పెండ్లి సుబ్బి చావు కొచ్చిందట. అలా ఉంది ఈ పిరోజ్ గాందీ గారో కోడలు వ్యవహరం. ఆవిడ గారీ పుట్టిన రోజు బహుమతిగా తెలంగాణా ఇచ్చేద్దామనే తలంపుతోనే హడావుడిగా అంత పెద్ద వ్యవహారాన్ని కూడా ఒక "టేబుల్ ఐటం " గా మార్చివేసి కూరలు పంపకం లాగా పంచి వెస్తుంది. అసలు రాయల తెలంగాణా ఎవరు అడిగారు? మొదట్నుంచి ఈ ప్రతిపాదన చేస్తూ వచ్చింది హైద్రాబాద్లో తప్పా మరెక్కడా లేని MIM పార్టీ అద్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ . ఆ తర్వాత ఈ ప్రతిపాదన తమ ప్రాంతానికి లాభిస్తుందని సీమ లోని కర్నూల్, అనంతపురం నాయకులు 2 వ ఆప్షన్ గా డిమాండ్ చెయ్యడం ప్రారం బించారు. ఇక కేంద్రం లోని కోంతమంది పెద్దలు అయితే , ఎవరు రాష్ట్ర విబజన గురించి ...