ఇంటి ఇల్లాలా ? పని+మని+షి యా!?
అమ్మ ప్రేమ కు ఖరీదు కట్టే షరాబులెవ్వరురా విన్నారా!ఈ శుభవార్త! కేంద్ర ప్రభుత్వం వారు ఇంటి ఇల్లాళ్లకు పనిమనిషి హొదాను కట్టబెట్టబోతుంది.ఇకనుంచి ఇంటాయన సంపాదనలొనుంచి 20% ఇంటి ఇల్లాలుకు అమే చెసే ఇంటి పనికి జీతంగ ఇవ్వాలంట.ఓ సారీ సారీ దానిని జీతం అనకుండా గౌరవ వేతనమో మరేదో అంటారంట!యెంత మంచి ఆలొచన వచ్చిందండి మన సర్కారుకు.ప్రజలు అడుగుతున్న ఎన్నో డిమాండ్లను పట్టిచ్చుకోకుండా ఎవరూ అడగని ఈ వరాన్ని భారత స్త్రీలకు ఇవ్వాలని ఎందుకు అనిపించింధో? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో త్వరలొనే తెలుస్తుంది.నిత్యావసర సరుకుల దరలు అదుపులొ పెట్టలేని సర్కారుకు ప్రజల ఇంటి విషయాలలొ కలగచేసుకునే నైతిక అర్హత ఉందా? ఆలొచించండి. సరే అవన్నీ రాజకీయ యెత్తుగడలు అనుకున్నా, వారి స్వార్దం కోసం బారతీయుల కాపురాల్లొ ఎందుకు లేనిపోని చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? మరి 20% ఇల్లాలుకు ఇచ్చివేసి 80% సంపాదన ఏమైన చేసుకొవచ్చా? దానిమీద ఇల్లాలుకు అదికారం ఉండదా? మరి ఇంట్లొ పిల్లల సంగతేమిటి? వాళ్లేమి పాపం చేసారు? ఒహో వాళ్లకి ఓటు హక్కు లేదు కదూ! మర్చేపొయాను.లేకపోతే వాళ్ల పర్సంటేజ్ డి