తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు
(రాజారపు వినోద్ కుమార్ గారి సౌజన్యంతో) మనకు జన్మనిచ్చిన జన్మదాతలు వారు. మనల్ని పెంచి పోషించి మన ఉన్నతి కోసం నిరంతరము తపించిన ఔదార్యమూర్తులు వారు. మనం బాదపడుతుంటె తల్లడిల్లిపోయిన కారుణ్యమూర్తులు వారు. వారికి చదువు లేకపోయిన మన చదువుల కోసం మన పుస్తకాలు మోసి , మనల్ని ప్రయోజకుల్ని చెసిన వయోజనులు వారు . మన కోసమ్ ఉన్న ఊళ్లో ఆస్తులు తాకట్టు పెట్టి మన భవిష్యత్తు కోసం బంగారు భాటలు వేసిన శ్రామికులు వారు. వారే మన తల్లి తండ్రులు. అటువంటి తల్లి తండ్రులును వ్రుద్దాప్యంలో తగిన గౌరవ ,సౌకర్యాలతో చూడవలసిన బాద్యత పిల్లల మీద లేదా? ఈ మద్య నా మిత్రుడు ఒకరి గురించి చెప్పాడు. తన మిత్రుదు ఒకాయనకి బార్య,ఇద్దరు పిల్లలు,తల్లి తండ్రి ఉన్నారంట . అయన బాగా స్తి...