Posts

Showing posts with the label ఖమ్మం M.Pకేంద్ర మంత్రి

ఆలూ లేక పోయినా , చూలు లేకపోయినా ఖమ్మం లో అబ్బాయి పుడితే మాత్రం కేంద్ర మంత్రి పదవి ఖాయమట !

                                                      అయన గారు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు . రాష్ట్ర విభజన జరుగక ముందు, అయన పార్టి పెట్టిన కొత్తలో 42 నియోజకవర్గాల్లో అయన పార్టికి కొంత హవా ఉన్న మాట నిజమే కావచ్చు . కాని ఆయనను ఆర్దిక నేరాల విచారణలో బాగంగా 18 నెలలు జైలులో పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వలన అయన గారి పార్టికి జనం లో ఆదరణ తగ్గుతూ రావడం మొదలు పెట్టింది . చివరకు రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 3 ప్రకారం విభజన  చేసినా అబ్యంతరం లేదని తొలుత ప్రకటించిన అయన , అ తర్వాత నాలుక్కరచుకుని జై సమైక్యతాoద్ర  అనే సరికి తెలంగాణా లో ఆయన్ని నమ్ముకుని ఉన్న ఆయనగారి విరాభిమానులు ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పార్టిని దాదాపు ఖాళి చేసారు                ఏదో అయన మిద ఉన్న అభిమానంతోనో , లేక అయన తండ్రి గారి మిద ఉన్న అభిమానంతోనో ఓట్లు పడవచ్చు అనే దింపుడు కళ్ళాలు ఆశ  ఉన్నవారు తప...