"గడ్డ పగిలిపోవును గాక ! గడ్డ పగిలిపోవును గాక " అని గొంతెత్తి విజ్ఞాన వేదిక లను సవాలు చేస్తున్న "దేవుని బిడ్డలు".
హిందువులు ఒక యజ్ఞం చేస్తుంటే అజ్ఞానం అంటారు. దేవుని కి అభిషేకం చేస్తుంటే పాలు ఎందుకు వేస్ట్ చెయ్యడం అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టెస్తుంటారు. వందల యేండ్లుగా నయా పైసా తీసుకోకుండా ఉబ్బస వ్యాది ఉపశమనానికి ఉచితంగా "చేప ప్రసాదం " ఇస్తుంటే సభలు పెట్టి మరీ నానా యాగీ చేస్తుంటారు. దేశం లో సైన్స్ తెలిసిన మేమే పెద్ద విజ్ఞానులం , పూజలు చేసే హిందువులు అంతా పెద్ద పిచ్చి పువ్వులే అని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు.సైన్స్ వేరు . నమ్మకం వేరు. దీనిని భారత రాజ్యాంగం కూడా అంగీకరించింది. అయినా సరే పదే పదే హిందువుల మనోబావాలను తీవ్రంగా గాయపరుస్తూ విదేశి శక్తుల మెప్పును పొందుతుంటారు.ఇదీ, తాము మాత్రమే జనాన...