తాగితే ఆడ ఐనా, మగ ఐనా ఒకటే!
మొన్న రెండు చోట్ల వేర్వేరు ఘటనలు జరిగాయి.మొదటిది తెనాలిలో తాగుబోతులైన యువకులు ఒక అమ్మాయిని అల్లరి చేసే క్రమంలో ఆమె తల్లిని లారీ క్రిందకు నెట్టి చంపారని పోలిస్ వారి సమాచారం. అలాగే హైద్రాబాదులో కొంతమంది అమ్మాయిలు పబ్బులో ఫుల్ గా తాగేసి, అర్థరాత్రి రోడ్డు మీదకు వచ్చి వీరంగం వేసి మీడియా వాళ్ళ మీద దౌర్జన్యం చేసారని వార్తలు. అర్థరాత్రి స్వాతంత్ర్యం గురించి గాంది గారు కన్న కలలు మనవాళ్ళు ఇలా నిజం చేస్తున్నందుకు ఎలా సిగ్గుపడాలో తెలియడం లేదు.అర్థరాత్రి ఒంటిగంట వరకు బారులకు లైసెన్స్ లు ఇచ్చిన ఈ సెన్స్ లేని పాలకుల వల్ల జరిగే అనర్థాలు ఇవి అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసిన, అసలు తాగడం అనేది తప్పు అని, ఒక వేళా అలవాటు ఉంటే దానిని లిమిట్ గా ఎలా వినియోగించాలో చెప్పే నిబందనలు ప్రబుత్వం చేసిందా? చెయ్యదు. ఎందుకంటే మనకున్న ప్రదాన వనరుల్లో "మద్యపానం" ఒకటి కాబట్టి. మనకు తాగడంలో, వాగడంలో, ఉన్నంత స్వేచ్చ బహూశా ఏ దేశంలో ఉండవనుకుంటా!ఈ మద్యనే ఎందుకో ప్రజల్లో చైతన్యం వచ్చినట్లుంది,ముందు వెనుక కానక ఇష్టం వచ్చినట్లు వాగే వారిన