రోజూ విజ్ఞానులు పోసే "విషం పాలు" గురించి ఆలోచించక , మత జ్ఞానులు పోసే "అభిషేక పాలు " గురించి ప్రశ్నిస్తున్న అజ్ఞానులు!
ఎదో హింది సినిమాలో ,ఒక లాయర్ పాత్రదారి చేత హిందూ మతం లో దేవుడికి చెసే 'పాలాభిషేకం ' గురించి ప్రశ్నింప చేస్తూ , భక్తులు "పిచ్చి పువ్వులు 'అనిపిస్తాడు దర్శక /రచయిత . దానిని విగ్రహారాదన అంటే ఈసడించుకునే అన్యమతస్తులు కొందరు పేస్ బుక్ లో పెట్టి తమ మత విదాన గొప్పదనాన్ని చాటాలని ప్రయత్నించారు . దానిని చూసిన నాకు వారి అమాయకత్వం మీద జాలి వేసింది . మనిషికి జ్ఞానం ముఖ్యమే .కాని అది ఉపయోగించే విదానం తెలియక పొతే ఆనందానికి దూరం చెస్తుంది .ఎక్కడ ఏది చెయ్యాలో తెలియ చెసే దానినే " ఇంగిత జ్ఞానం" అంటారు . అలాంటి ఇంగిత జ్ఞానం లేని వారు ,తమ మతాలలో ఉన్న లోపాలను కప్పి పెట్టుకుని ,ఎదుటివారి మతాల గురించి రంద్రాన్వేషణ చేస్తుంటారు . వీరు వేమన గారి పద్యంలో "గురివింద " బాపతు వాళ్ళు . అలాగే విజ్ఞాన వాదుల0 అని చెప్పుకుంటున్న వారు సైతం సమాజంలో విజ్ఞాన పరంగా జరుగుతున్న అనర్దాలు గురించి ఆలోచించకుండా ,కేవలం...