వందమంది దేవయాని లను వివస్త్ర లను చేసినా , అమెరికా అమెరికాయే, కాంట్రాక్ట్ కాంట్రాక్టే !
దేవయాని ! మన పురాణ గాధలలోని రాక్షస గురువులు అయిన శుక్రాచార్యుల వారీ కుమార్తె పేరు అది. ఆ పేరును ముంబాయికి చేందిన I.A.S ఆపిసర్ గారైన ఉత్తమ్ కోబ్రగాదె గారు తన కుమార్తెకు పెట్టుకున్నారు. ఆ అమ్మాయే ఇప్పుడు బారత, అమెరికా మద్య చెలరేగిన దౌత్య సంబందాల వివాదాలకు కేంద్ర బిందువు. దేవయాని కోబ్రగాదె U.S లోని న్యూ యార్క్ లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటి కాన్స్యుల్ జనరల్ గా పని చేస్తుంది. దేవయానీ పుట్టి , పెరిగిందీ ముంబై లోనే . మరాఠీ తో పాటూ ఆమె ఇంగ్లీష్, హిందీ , జర్మనీ బాషలలో అసామాన్యమైన పట్తుందని అంటారు . సివిల్స్ రాసి ఐఎఎఫ్ అధికారిగా ఆమె భాద్యతలు చేపట్టింది 1999 లో . పాకిస్తాన్ , ఇటలీ , జర్మనీ దేశాల్లోని భారత రాయబార కేంద్రాల్లో పనిచేసారు . . ఐఎఫ్...