స్వలింగ సంపర్కులను సాచి కొట్టిన సుప్రీం !
గారాబం ఎక్కువైతే వెన్న కాల్చుకుని తింటాను అన్నాడట వెనుకటికి పిల్లోడు ఒకడు ! అలా ఉంది మన దేశం లోని కొంతమంది హక్కుల పోరాటాలు. మనం ఏది చేయ్యాలో ఏది చెయ్యకూడదో సాద్యమైనంత వరకు ప్రక్రుతి గురువులా అన్నీ చెపుతూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతిని మించిన గురువు లేదు నేర్చుకునే శక్తి ఉంటే. ఇదే దత్తాత్రేయుల వారి సిద్దాంతం. మనుషులమైన మనం శక్తి కొరకు ఆహారం బుజించాలంటే నోటితోనే తినాలి. ఆ సౌలబ్యం కరువైన రోగులకు సూదుల ద్వారా శక్తిని ద్రవ రూపంలో శరీరానికి అందిస్తారు. కానీ అన్నీ సక్రమంగా ఉన్న వారు నేను నోటి తో తినను , ఇంకా దేనితో అయినా తింటాను అంటే , నీ ఇంట్లో నువ్వు తిను , నీ చావు నీవు చావు అంటారు. అంతే కానీ నీవు చేసే పనిని కూడా సమాజం ఆమోదించాలి, నిన్ను ఎవరూ తప్పు పట్టకూడదు అంటే ఎలా? అసహజమైన పని చెయ్యడాన్ని ఖండించే అధికారం సమాజం కి ఉంటుంది. నీవు చేసే పిచ్చి పనిని మరొకరు చేయకు...